ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 405 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. జనవరి 31 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పడు చూద్దాం.
పూర్తి వివరాలు:
IOCL అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2026
మొత్తం పోస్టులు: 405
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు: 210
టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు : 120
ట్రేడ్ అప్రెంటిస్ (ITI) పోస్టులు: 50
డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) పోస్టులు: 25
అర్హతలు:
ట్రేడ్ అప్రెంటిస్: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ (ITI) పూర్తి చేసి ఉండాలి.
టెక్నీషియన్ అప్రెంటిస్: సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో 3 ఏళ్ల డిప్లొమా ఉండాలి.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: ఏదైనా విభాగంలో డిగ్రీ (B.A./B.Com/B.Sc/B.B.A) కలిగి ఉండాలి.
డేటా ఎంట్రీ ఆపరేటర్: కనీసం 50% మార్కులతో ఇంటర్ పూర్తి చేసి ఉండాలి.
వయస్సు: (డిసెంబర్ 31, 2025 నాటికి)
అభ్యర్థుల కనీస వయస్సు 18 ఏళ్లు కాగా, గరిష్ట వయస్సు 24 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్లకు చివరి తేదీ: జనవరి 31 (సాయంత్రం 5:00 గంటల వరకు)అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఎంపిక విధానం:
ఎలాంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు. అభ్యర్థులు అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్‌నెస్ పరీక్ష ఉంటుంది.
అప్లికేషన్ విధానం:
అభ్యర్థులు సంబంధిత పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ సంప్రదించవచ్చు.





