ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్.. 291 జనరలిస్ట్, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి.. ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా JMG స్కేల్-I, MMG స్కేల్-II, MMG స్కేల్-III కేడర్లలోని బ్రాంచ్ మేనేజ్‌మెంట్, IT, క్రెడిట్, రిస్క్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ.. విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి , అర్హత.. కలిగిన అభ్యర్థులు ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 15 వరకు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు జీతంతో పాటు ఇతర అలవెన్సులు కూడా అందుతాయి.
ముఖ్యమైన వివరాలు:
మొత్తం ఖాళీలు: 291
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: ఆగస్టు 29 నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవాలి.
చివరి తేది: సెప్టెంబర్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు.
పోస్టులు & ఖాళీల వివరాలు:
మేనేజర్ (బ్రాంచ్ మేనేజ్‌మెంట్) –100
మేనేజర్ (IT) – 65
మేనేజర్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ) –5
మేనేజర్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆడిట్) –5
సీనియర్ మేనేజర్ (IT) –10
సీనియర్ మేనేజర్ (క్రెడిట్) –15
మేనేజర్ (క్రెడిట్) –35
అసిస్టెంట్ మేనేజర్ (సెక్యూరిటీ) –25
(ఇతర సైబర్ సెక్యూరిటీ, నెట్‌వర్క్, డేటాబేస్, రిస్క్ మేనేజ్‌మెంట్ పోస్టులు కూడా ఉన్నాయి)
వయోపరిమితి (01.08.2026 నాటికి):
పోస్టును బట్టి కనీసం 22 ఏళ్ల నుంచి గరిష్టంగా 45 ఏళ్ల.. వరకు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు , దివ్యాంగులకు 10 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
విద్యార్హత & అనుభవం:
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ, B.E/B.Tech, MCA, M.Sc (IT) లేదా MBA (Finance)/CA పూర్తి చేసి ఉండాలి. పోస్టును బట్టి బ్యాంకింగ్/ఐటీ విభాగంలో సంబంధిత పని అనుభవం తప్పనిసరి.
ఎంపిక విధానం:
ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మెరిట్ జాబితాలో రాత పరీక్షకు 80%, ఇంటర్వ్యూకి 20% వెయిటీజీ ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ,ఎస్టీ, అభ్యర్థులకు రూ. 175, ఇతర అభ్యర్థులందరూ (OBC, EWS, Gen)..రూ.1,000 చెల్లించాలి.
మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ www.iob.bank.in/en సంప్రదించవచ్చు.





