HomeJOBSడిగ్రీ అర్హతతో..లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు

డిగ్రీ అర్హతతో..లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు

బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బ్రాంచ్‌ల కోసం లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-I కేటగిరీ కింద మొత్తం 250 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆగస్ట్ 24 తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

నోటిఫికేషన్ వివరాలు:

ఖాళీలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 250 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఖాళీలు ప్రధానంగా నాలుగు రాష్ట్రాల్లో. తమిళనాడులో 100, కర్ణాటకలో 50, మహారాష్ట్రలో 50, గుజరాత్‌లో 50 చొప్పున ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు కేవలం ఏదో ఒక రాష్ట్రానికి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దేశంలో ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఈ పోస్టులకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులు మొదటి 12 సంవత్సరాల కాలం పాటు లేదా పదోన్నతి వచ్చే వరకు దేనికైతే అప్లై చేసుకున్నారో ఆ రాష్ట్రంలోనే విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

విద్యార్హత, వయస్సు:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసే నాటికి అభ్యర్థులు డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఇక వయస్సు విషయానికి వస్తే, 01.08.2026 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు వయస్సు సడలింపు వర్తిస్తుంది.

ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ:
ఆగస్ట్ 8వ తేదీ నుంచి అప్లికేషన్లు ప్రారంభం అయ్యాయి.

చివరి తేదీ: ఆగస్ట్ 24 తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఫీజు:
అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే,ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు కేవలం రూ 175 ఇంటెమేషన్ ఛార్జీల కింద చెల్లించాలి. జనరల్,ఈడబ్ల్యూఎస్ , ఓబీసీ అభ్యర్థులు రూ.850 చెల్లించాల్సి ఉంటుంది. ఫీజును ఆన్‌లైన్ ద్వారా మాత్రమే ఫీజు చెల్లించాలి.

ఎంపిక విధానం ,జీతం వివరాలు:
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఆన్‌లైన్ రాత పరీక్ష, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ , పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ఆన్‌లైన్ పరీక్షలో రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, జనరల్/బ్యాంకింగ్ అవేర్‌నెస్, డేటా అనాలిసిస్ , ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. తప్పు సమాధానానికి 0.25 మార్కు కట్ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-I (JMGS-I) కింద జీతం లభిస్తుంది. బేసిక్ పే తో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ , ఇతర అలవెన్సులు బ్యాంక్ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి.

అప్లికేషన్ విధానం:
అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు చివరి తేదీ లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా https://www.iob.bank.in/en/ ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here