బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే యువతకు చెన్నై ప్రధాన కేంద్రంగా..పని చేస్తున్న ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ‘ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్'(IOB) గుడ్ న్యూస్ అందించింది. 2026-27సంవత్సరానికి గానూ దేశ వ్యాప్తంగా.. ఏకంగా 750 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఒక సంవత్సరం కాంట్రాక్ట్ ఉండే ఈ అప్రెంటిస్ పోస్టులకు స్టైఫండ్ కూడా ఇస్తారు. అర్హత, ఆసక్తి కలిగి ఉన్న అభ్యర్థులు జులై 20వ తేదీ వరకు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 750
ముఖ్యమైన తేదీలు: ఆన్‌లైన్ అప్లికేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అప్లై చేయడానికి చివరి తేదీ జులై 20.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి.. డిగ్రీ పాసైన వారు అర్హులు. 31.07.2026 లోపు రిజల్ట్స్ డిక్లేర్ అయి ఉండాలి.
వయస్సు:
01.07.2026 నాటికి అభ్యర్థుల కనీస వయస్సు 20 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్టంగా 28 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
స్టైపెండ్ వివరాలు :
ఈ వన్-ఇయర్ ట్రైనింగ్‌లో అభ్యర్థులు పనిచేసే బ్రాంచ్ ఏరియాను బట్టి నెలవారీ స్టైపెండ్ ఇస్తారు.
మెట్రో సిటీస్: రూ.15,500/-
అర్బన్ ఏరియాస్: రూ.14,400/-
సెమీ అర్బన్/రూరల్ ఏరియాస్:రూ.14,000/-
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.236 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.708 చెల్లించాలి.
ఎంపిక విధానం:
ఆన్‌లైన్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎగ్జామ్ పాటర్న్ (100 మార్కులు-90 నిమిషాలు):
జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్ (25 ప్రశ్నలు – 25 మార్కులు)
జనరల్ ఇంగ్లీష్ (25 ప్రశ్నలు – 25 మార్కులు)
క్వాంటిటేటివ్ & రీజనింగ్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలు-25 మార్కులు)
కంప్యూటర్/సబ్జెక్ట్ నాలెడ్జ్ (25 ప్రశ్నలు-25 మార్కులు)
ఈ ఎగ్జామ్ ఆగస్టు 2న నిర్వహించే అవకాశం ఉంది. ఇందులో క్వాలిఫై అయిన వారికి.. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ (తెలుగు మాట్లాడటం, రాయడం, చదవడం) ఉంటుంది. ఒక వేళ మీరు టెన్త్ లేదా ఇంటర్ లో తెలుగు ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉంటే..ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ నుంచి మినహాయింపు లభిస్తుంది.
ఎలా అప్లై చేయాలి?
అర్హత గల అభ్యర్థులు NATS లేదా NAPS పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుని.. ఆపై IOB అధికారిక వెబ్‌సైట్ (www.iob.bank.in) ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.





