ఇంటర్నేషనల్ లైఫ్ స్కిల్ ఒలింపియాడ్స్’ నిర్వహణకు స్కిల్‌జన్ ఒలింపియాడ్ ఫౌండేషన్ (సింగపూర్) ప్రకటన విడుదల చేసింది.
2021–22 సంవత్సరానికిగాను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 3–12 తరగతుల విద్యార్థులకు క్రిటికల్ లైఫ్ స్కిల్స్‌పై ఈ ఒలింపియాడ్స్‌ను నిర్వహించనున్నారు. దీని ద్వారా పాఠశాల స్థాయి పిల్లల్లో ఉన్న వ్యక్తిగత, వృత్తిపరమైన, సామాజిక జీవితాల్లో ఎదురయ్యే ఇబ్బందులను, నైపుణ్యాలను ప్రాథమికంగా అంచనావేస్తారు. అనంతరం లోపాలను గుర్తించి వాటిని అధిగమించడానికి తగిన శిక్షణనందిస్తారు. సుమారు 72 దేశాల విద్యార్థుల కోసం నిర్ధేశించిన ఈ కార్యక్రమంలో పిల్లలకు జీవన నైపుణ్య మార్గదర్శకాలు, సాధన ప్రశ్నలు, మాక్ టెస్టులు నిర్వహిస్తారు.
రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ : డిసెంబర్ 30
వెబ్సైట్ : www.lifeskillsolympiyad.org
శస్త్ర వర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో అడ్మిషన్స్
తమిళనాడులోని శస్త్ర యూనివర్సిటీలో యూజీ,పీజీ ప్రోగ్రాముల్లో దూర విద్య ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఆన్లైన్లో దరఖాస్తుకు చివరితేదీ : డిసెంబర్ 31
వెబ్సైట్ : www.sastra.edu
ద్రవిడ వర్సిటీలో పీజీ, డిప్లొమా కోర్సులు
కుప్పం ద్రవిడియన్ యూనివర్సిటీ 2021–22 విద్యాసంవత్సరానికి పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువరించింది.
ఆన్లైన్లో దరఖాస్తుకు చివరితేదీ : డిసెంబర్ 20
వెబ్సైట్ : www.dravidianuniversity.ac.in
హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం.
హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థుల నుంచి నేషనల్ సెంటర్ ఫర్ సేఫ్టీ ఇంజినీరింగ్ సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
దరఖాస్తుకు చివరితేదీ : డిసెంబర్ 21
వివరాలకు ఫోన్ : 9701496748
జీజీహెచ్, విజయవాడలో 117 పోస్టులు
విజయవాడ ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో కాంట్రాక్ట్ బేసిక్‌లో ల్యాబ్ టెక్నీషియన్ , ఫార్మసిస్ట్, ఫిజిసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుకు చివరితేదీ : డిసెంబర్ 15
వెబ్సైట్ : www.krishna.ap.gov.in
వైద్య ఆరోగ్య శాఖలో 61 ఫార్మసిస్టు జాబ్స్
గుంటూరు జిల్లా వైద్యారోగ్య శాఖ లో కాంట్రాక్ట్ బేసిక్‌లో 61 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హత : ఇంటర్+ఫార్మసీకోర్సు
ఆఫ్‌లైన్‌లో దరఖాస్తుకు చివరితేదీ : డిసెంబర్ 21
వెబ్సైట్ : guntur.ap.gov.in
లక్నో సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..
సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ప్రాజెక్ట్ సైంటిస్ట్, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటీవ్, అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం పోస్టులు : 37
ఆన్లైన్లో దరఖాస్తుకు చివరితేదీ : డిసెంబర్ 17
వెబ్సైట్ : www.cdri.res.in