HomeLATESTఇంటర్​ ఫస్టియర్​ రిజల్ట్ పై దుమారం.. అందరినీ పాస్​ చేద్దామా..? సీఎం వద్దకు ఫైల్​

ఇంటర్​ ఫస్టియర్​ రిజల్ట్ పై దుమారం.. అందరినీ పాస్​ చేద్దామా..? సీఎం వద్దకు ఫైల్​

ఇంటర్​ ఫస్టియర్​ లో ఫెయిలైన​ స్టూడెంట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. 4.59 లక్షల మంది పరీక్షలు రాస్తే.. ఏకంగా 2.35 లక్షల మంది ఫెయిలవటంతో ఇంటర్​ విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.

Advertisement



కరోనా ఎఫెక్ట్ తో రెండేండ్లు విద్యార్థులు స్టడీకి దూరం కావటం.. సెకండియర్​ పాఠాలు జరిగే టైమ్​లో ఇంటర్​ ఫస్టియర్​ పరీక్షలు పెట్టడం.. నెల రోజులు కూడా క్లాసులు నిర్వహించకుండానే ఎగ్జామ్స్​పెట్టిన కారణంగానే 51 శాతం మంది విద్యార్థులు ఫెయిలయ్యారని ఇంటర్​ బోర్డు కూడా అంచనాకు వచ్చింది. అందుకే రిజల్ట్ వెల్లడించటంలోనూ జాప్యం చేసిందనే విమర్శలు వచ్చాయి. తీరా.. రిజల్ట్ వెల్లడించిన తర్వాత రాష్ట్రమంతటా దుమారం చెలరేగటంతో ఇటు ఇంటర్​ బోర్డు.. అటు ప్రభుత్వం తల పట్టుకుంటోంది.

ఇప్పుడేం చేద్దామనే విషయంలోనూ ఉన్నత స్థాయిలో తర్జన భర్జనలు మొదలయ్యాయి. ఇప్పటికే ఇంటర్​ బోర్డు దిద్దుబాటు చర్యలకు సంబంధించిన ప్రతిపాదనలను సీఎంకు పంపించినట్లు తెలుస్తోంది. మొత్తం ఫెయిలైన స్టూడెంట్లను కూడా మినిమమ్​ మార్కులతో పాస్​ చేయటం.. లేదా ఉచితంగా రీ కౌంటింగ్​, రీ వెరిఫికేషన్​ సదుపాయం కల్పించాలని ఇంటర్ బోర్డు ఆలోచిస్తోంది. అవే ప్రతిపాదనలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీఎంకు ఫైల్​ను అందజేసినట్లు తెలిసింది. సీఎం తీసుకునే తుది నిర్ణయం మేరకే చర్యలుంటాయని బోర్డు అధికారులు చెబుతున్నారు.

సీఎం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడకపోతే.. ఫెయిలైన విద్యార్థులు ఏప్రిల్​లో జరిగే పరీక్షల్లోనే ఫస్ట్ ఇయర్​ తో పాటు సెకండియర్​ పరీక్షలు అటెండ్​ చేయాల్సి ఉంటుంది. కేవలం నాలుగు నెలల వ్యవధి మాత్రమే ఉండటంతో ఈలోగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే ప్రసక్తి లేదని ఇంటర్​ బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈసారి రీకౌంటింగ్​, రీ వెరిఫికేషన్​ ఫీజును సగానికి తగ్గించినట్లు ఇంటర్​ బోర్డు ప్రకటించింది.

PRACTICE TESTS FOR ALL EXAMS

merupulu study and jobs group

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN CONSTITUTION

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!