జూన్ చివరి వారంలో ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశాలున్నాయి. కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టిన తర్వాత అప్పుడుండే పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి జూన్ మొదటి వారంలో రివ్యూ చేయనున్నట్లు ప్రకటించింది. విద్యార్థులకు అనువుగా ఉండేందుకు వీలుగా కనీసం 15 రోజుల ముందు పరీక్షల షెడ్యూలు అనౌన్స్ చేస్తామని వెల్లడించింది. ఫస్ట్ ఇయర్ విద్యార్థులను సెకండియర్కు ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరిస్థితులను బట్టి వాళ్లకు ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. సెకండియర్ విద్యార్థులకు సంబంధించి ఏమైనా బ్యాక్ లాగ్స్ ఉంటే.. (ఫస్ట్ ఇయర్లో ఫెయిలైన్ సబ్జెక్టులుంటే) వాటికి పాస్ మార్కులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఎంసెట్ ఎగ్జామ్కు ఇంటర్ మార్కుల్లో 25 శాతం వెయిటేజీ నిబంధనను పరిగణించేది లేదని ప్రకటించింది.
