HomeLATESTఇంటర్‌లో ప్రశ్నల చాయిస్‌ డబుల్‌

ఇంటర్‌లో ప్రశ్నల చాయిస్‌ డబుల్‌

ఇంటర్‌ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. వార్షిక పరీక్షల్లో ప్రశ్నల చాయిస్‌ను అధికారులు డబుల్​ చేశారు. ప్రశ్నల సంఖ్యను కూడా గణనీయంగా పెంచారు. గతంలో కొన్ని సెక్షన్లలో మాత్రమే చాయిస్‌ ప్రశ్నలు ఇవ్వగా, ఈ ఏడాది అన్ని సెక్షన్లలో ప్రశ్నల సంఖ్యను పెంచి, చాయిస్‌గా వదిలేసుకొనే అవకాశం కల్పించారు. 2021–-22 సంవత్సరానికి తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ మీడియాల మాదిరి ప్రశ్నపత్రాలను ఇంటర్‌బోర్డు అధికారులు వెబ్‌సైట్‌లోపెట్టారు. గతేడాది మూడు సెక్షన్లకుగాను రెండింటిలో మాత్రమే 50 శాతం చాయిస్‌ ప్రశ్నలు ఇవ్వగా.. ఇప్పుడు మూడు సెక్షన్లలో చాయిస్‌ ప్రశ్నలిచ్చారు. ప్రస్తుతం ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ విద్యార్థులు ఎస్సెస్సీలో పరీక్షలు రాయకుండానే పాసయ్యారు. పైగా గతేడాది నిర్వహించిన పరీక్షల్లో అత్యధికులు ఫెయిల్‌ కావడంతో చాయిస్‌ ప్రశ్నలు పెంచి మోడల్‌ ప్రశ్నపత్రాలను సిద్ధంచేశారు.

Advertisement

పేపర్లవారీగా చాయిస్‌

  • మ్యాథ్స్​ సెక్షన్‌ -ఏలో 15 ప్రశ్నలకు గాను పదింటికి సమాధానాలు రాయాలి. ఐదు ప్రశ్నలను చాయిస్‌గా వదిలేసుకొనే అవకాశమిచ్చారు. గతేడాది ఈ సెక్షన్‌లో మొత్తం ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉండేది. సెక్షన్‌ -బీలో 11 ప్రశ్నల్లో ఐదింటికి సమాధానాలు రాయాలి. ఆరు ప్రశ్నలు వదిలేయవచ్చు. సెక్షన్‌ -సీలో 9 ప్రశ్నలు ఉంటాయి. ఐదింటికి సమాధానాలిస్తే సరిపోతుంది. నాలుగు ప్రశ్నలు చాయిస్‌.
  • ఆర్థికశాస్త్రం సెక్షన్‌ – ఏలో ఏడు ప్రశ్నలకు మూడింటికి సమాధానాలు రాయాలి. నాలుగు ప్రశ్నలు చాయిస్‌. సెక్షన్‌ -బీలో 17 ప్రశ్నల్లో 8 సమాధానాలు రాయాలి. 9 ప్రశ్నలు వదిలేయవచ్చు. సెక్షన్‌ -సీలో 15 ప్రశ్నలకు సమాధానం రాయాలి. 24 ప్రశ్నలిచ్చారు. 9 ప్రశ్నలు వదిలేసుకోవచ్చు.
  • కెమిస్ట్రీ, ఫిజిక్స్​ సెక్షన్‌ -ఏలో 10 ప్రశ్నలకు సమాధానాలివ్వాలి. 15 ప్రశ్నలు ఇస్తారు. ఐదు చాయిస్‌. సెక్షన్‌ -బీలో 13 ప్రశ్నలకు ఆరింటికి సమాధానమిస్తే సరిపోతుంది. సెక్షన్‌ -సీలో నాలుగింటిలో రెండింటికి సమాధానం ఇవ్వాలి.
  • ఇంగ్లిష్‌లో సెక్షన్‌ -ఏలో ఐదు ప్రశ్నలిచ్చారు. రెండింటికి సమాధానం రాయాలి. సెక్షన్‌ -బీలో ఆరు ప్రశ్నలకుగాను నాలుగింటికి సమాధానాలిస్తే సరిపోతుంది. సెక్షన్‌ -సీలో 50 శాతం ప్రశ్నలను చాయిస్‌గా ఇచ్చారు.
  • తెలుగులో సెక్షన్‌ -1 లో 8 మార్కుల ప్రశ్నలు మూడిచ్చి ఒకటి రాసుకొనే అవకాశమిచ్చారు. సెక్షన్‌ -2, 3లలో 6 మార్కుల ప్రశ్నలు మూడింట్లో ఒకదానికి సమాధానమిస్తే సరిపోతుంది. సెక్షన్‌ -4లో 4 మార్కులవి 5 ప్రశ్నలివ్వగా, రెండింటికి, సెక్షన్‌ 5, 6లలో 3 మార్కులవి 6 ప్రశ్నల్లో రెండింటికి సమాధానాలివ్వాలి. సెక్షన్‌ 7, 8లలో 2 మార్కులవి ఐదు ప్రశ్నల్లో రెండింటికి సమాధానాలు రాయాలి. సెక్షన్‌ 9, 10లలోనూ చాయిస్‌ ప్రశ్నలను పెంచారు

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!