HomeLATESTఇంటర్​తో ఇంటిగ్రేటెడ్​ ఎంబీఏ

ఇంటర్​తో ఇంటిగ్రేటెడ్​ ఎంబీఏ

ఇంటర్మీడియేట్​ తర్వాత మేనేజ్​మెంట్​ కోర్సులు చదవాలనుకునే వారికి గుడ్​న్యూస్​. ఇంటర్​​ అర్హతతో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్​ ఎంబీఏ చదివేందుకు ఇండియన్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ మేనేజ్‌మెంట్​ –ఐఐఎం రోహ్​తక్​ నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈ​ కోర్సులో చేరిన వారికి మూడేళ్ల తర్వాత బీబీఏ డిగ్రీని, ఐదేళ్ల తర్వాత ఎంబీఏ డిగ్రీని అందజేస్తారు. టెన్త్​, ఇంటర్​లో కనీసం 60 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీలకు 55శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి. వయసు 20 ఏళ్ల లోపు ఉండాలి. ఎంట్రెన్స్​, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తారు.

Advertisement

కోర్సులో భాగంగా ఏడాదికి మూడు టర్మ్​ల చొప్పున ఐదేళ్లలో 15 టర్మ్​లు ఉంటాయి. ఒక్కో టర్మ్​ వ్యవధి 3నెలలు ఉంటుంది. ప్రతి అకడమిక్​ ఇయర్​ చివరలో ఇంటర్న్​షిప్​లు పూర్తి చేయాల్సి ఉంటుంది. మొత్తం 150 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఐదేళ్ల కోర్సుకు గాను మొత్తం ఫీజు రూ. 34లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అర్హత కలిగిన విద్యార్థులు రుణ సౌకర్యం పొందవచ్చు.

రాత పరీక్ష ఆబ్జెక్టివ్​ టైపులో ఉంటుంది. క్వాంటిటేటివ్​ ఎబిలిటీ, లాజికల్​ రీజనింగ్​, వెర్బల్​ ఎబిలిటీ ఒక్కో విభాగం నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు ఉంటుంది. ఒక్కో ప్రశ్నలకు 4మార్కులు చొప్పున కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. రాత పరీక్షలో మెరిట్​ సాధించిన వారికి ఆన్​లైన్​, వర్చువల్​ విధానంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇందులో అకడమిక్స్​, జనరల్​ అవేర్​నెస్​, కమ్యూనికేషన్​ స్కిల్స్​ను పరిశీలిస్తారు.

ఆన్​లైన్​ రిజిస్ట్రేషన్​ చేసుకునేందుకు మే 2 చివరితేది. దరఖాస్తు ఫీజు రూ. 3,890 ఉంటుంది. రాత పరీక్ష మే 21న నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్​, విశాఖపట్నంలో పరీక్షా కేంద్రాలున్నాయి.

వెబ్​సైట్​ : www.iimrohtak.ac.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!