HomeLATESTఇండియ‌న్ కోస్ట్ గార్డు, ఆర్మ్​డ్​ ఫోర్స్​లో నావిక్ , యాంత్రిక్​​ పోస్టులు

ఇండియ‌న్ కోస్ట్ గార్డు, ఆర్మ్​డ్​ ఫోర్స్​లో నావిక్ , యాంత్రిక్​​ పోస్టులు


ఇండియ‌న్ కోస్ట్ గార్డు, ఆర్మ్‌డ్ ఫోర్స్‌ల్లో నావిక్ (జ‌న‌ర‌ల్ డ్యూటీ), నావిక్‌(డొమెస్టిక్ బ్రాంచ్‌), యాంత్రిక్ బ్యాచ్‌ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది.

Advertisement


మొత్తం ఖాళీలు: 322


పోస్టులు- ఖాళీలు:


1) నావిక్ (జ‌న‌ర‌ల్ డ్యూటీ): 260
2) యాంత్రిక్ (మెకానిక‌ల్‌): 13
3) నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్‌): 35
4) యాంత్రిక్ (ఎల‌క్ట్రానిక్స్‌): 5
5) యాంత్రిక్ (ఎల‌క్ట్రిక‌ల్‌): 9

Advertisement


అర్హత‌, వ‌య‌సు:


1) నావిక్ (జ‌న‌ర‌ల్ డ్యూటీ): మ్యాథ్స్‌, ఫిజిక్స్ సబ్జెక్టుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణత‌.
వ‌య‌సు: 18 నుంచి 22 ఏండ్ల మధ్య ఉండాలి. 1 ఆగస్టు 2000 – 31 జులై 2004 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.
2) నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్‌): గుర్తింపు పొందిన ఎడ్యుకేష‌న్ బోర్డుల నుండి ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణత‌.
వ‌యసు: 18 నుంచి 22 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. 1 అక్టోబరు 2000 – 30 సెప్టెంబరు 2004 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.
3) యాంత్రిక్‌: గుర్తింపు పొందిన ఎడ్యుకేష‌న్ బోర్డుల నుండి ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణతతో పాటు ఎల‌క్ట్రిక‌ల్‌/ మెకానిక‌ల్‌/ ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలీక‌మ్యూనికేష‌న్(రేడియో/ ప‌వ‌ర్‌) ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత‌.
– ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

సెలెక్షన్​ ప్రాసెస్​: నాలుగు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

Advertisement


మొద‌టి ద‌శ‌(స్టేజ్-1‌): స్టేజ్‌-1లో రాత‌ప‌రీక్ష ఉంటుంది. ఇందులో సెక్షన్‌-1, 2, 3, 4, 5 ప‌రీక్షలు నిర్వహిస్తారు. సంబంధిత పోస్టుల‌కు ఏ సెక్షన్ ప‌రీక్ష నిర్వహిస్తారు, దానిలో సాధించాల్సిన ఉత్తీర్ణత మార్కులు, సంబంధిత స‌బ్జెక్టుల సిల‌బ‌స్‌, ప‌రీక్షా స‌మ‌యం, వ‌చ్చే ప్రశ్నల‌ గురించి నోటిఫికేషన్​లో వివ‌రంగా ఇచ్చారు.


రెండో ద‌శ‌(స్టేజ్‌-2): మొద‌టి ద‌శ‌లో నిర్వహించిన కంప్యూట‌ర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్‌లో ప్రతిభ ఆధారంగా మెరిట్ జాబితా త‌యారు చేస్తారు. దీని ప్రకారం స్టేజ్‌-2కి ఎంపిక చేస్తారు. ఇందులో ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్, రీ అసెస్‌మెంట్ టెస్ట్‌, తొలి మెడిక‌ల్ టెస్ట్ ఉంటాయి.


మూడో ద‌శ (స్టేజ్‌-3): స్టేజ్‌-1, స్టేజ్‌-2లో ప్రతిభ ఆధారంగా స్టేజ్‌-3కి ఎంపిక చేస్తారు. స్టేజ్‌-3లో డ్యాక్యుమెంట్ వెరిఫికేష‌న్‌, ఫైన‌ల్ మెడిక‌ల్ టెస్ట్‌, ఒరిజిన‌ల్ డాక్యుమెంట్ వెరిఫికేష‌న్, పోలీస్ వెరిఫికేష‌న్ ఉంటాయి.

Advertisement


నాలుగో ద‌శ (స్టేజ్‌-4): ఇందులో వివిధ ఎడ్యుకేష‌న్ బోర్డ్‌లు/ యూనివ‌ర్సిటీలు/ రాష్ట్రప్రభుత్వం నుంచి పొందిన ఒరిజిన‌ల్ స‌ర్టిఫికెట్లు ఇండియ‌న్ కోస్టు గార్డ్ ముందు ఉంచాలి.


ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్​లో అప్లై చేసుకోవాలి.


అప్లికేషన్​ ఫీజు: జనరల్​ అభ్యర్థులకు రూ.250 (ఎస్సీ/ ఎస్టీల‌కు ఫీజు లేదు)

Advertisement


అప్లికేషన్స్​ ప్రారంభం: 4 జనవరి 2022
చివ‌రి తేది: 14 జనవరి 2022
వెబ్​సైట్​: www.joinindiancoastguard.cdac.in

PRACTICE TESTS FOR ALL EXAMS

merupulu study and jobs group

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN CONSTITUTION

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!