ప్రపంచంలో మానవాళి మనుగడ ఉన్నంత వరకు స్టాటిస్టిక్స్ రంగానికి ఢోకాలేదు. జనాభా లెక్కల నుంచి మొదలుపెడితే అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో స్టాటిస్టిక్స్‌కు ఎనలేని ప్రాధాన్యం ఉంది. దేశంలో అత్యున్నతమైన సంస్థగా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ కోల్‌కతా పేరుగాంచింది. ఆ సంస్థ ఇతర క్యాంపస్‌లలో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైన నేపథ్యంలో కోర్సు వివరాలు తెలుసుకుందాం..
ఐఎస్‌ఐ క్యాంపస్‌లు: ఐఎస్‌ఐ కోల్‌కతా ప్రధానకార్యాలయంగా పనిచేస్తుంది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, తేజ్‌పూర్‌లలో క్యాంపస్‌లు ఉన్నాయి. గిరిదిహ్, కోయంబత్తూర్, హైదరాబాద్, ముంబై, పుణె, వడోదరలలో బ్రాంచీలను ఏర్పాటుచేశారు.
అందిస్తున్న కోర్సులు
ప్రోగ్రామ్స్ బీస్టాట్ (ఆనర్స్): కోల్‌కతా క్యాంపస్‌లో ఆనర్స్ విధానంలో కోర్సు నిర్వహిస్తున్నారు. వ్యవధి మూడేండ్లు ఉంటుంది. మొత్తం 50 సీట్లు ఉన్నాయి. మ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్ పాసైన విద్యార్థులు అర్హులు. సెలెక్ట్ అయిన విద్యార్థులకు నెలకు రూ.5000/- ఇస్తారు.
బీమ్యాథ్స్ (ఆనర్స్): బెంగళూరు క్యాంపస్‌లో ఆనర్స్ విధానంలో నిర్వహిస్తున్నారు. కోర్సు వ్యవధి మూడేండ్లు ఉంటుంది. ఇందులో మొత్తం 50 సీట్లు ఉన్నాయి. మ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు అర్హులు. ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.5000/- ఇస్తారు.
ఎం.స్టాట్ (మాస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్): ఈ కోర్సును ఢిల్లీ క్యాంపస్ ఆఫర్ చేస్తుంది. ఏదైనా మూడేండ్ల డిగ్రీ లేదా బీఈ / బీటెక్ కోర్సు చదివి ఉండాలి. ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.8000/- ఇస్తారు.
ఎం.మ్యాథ్స్ (మాస్టర్ ఆఫ్ మ్యాథమెటిక్స్): ఈ కోర్సు కోల్‌కతా క్యాంపస్‌లో అందిస్తున్నారు. మూడేండ్ల డిగ్రీ లేదా బీఈ / బీటెక్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు అర్హులు. నెలకు రూ.8 వేలు ఇస్తారు.
ఎంఎస్ (క్వాంటిటేటివ్ ఎకనామిక్స్): కోల్‌కతా, ఢిల్లీ క్యాంపస్‌లలో ఈ కోర్సును అందిస్తున్నారు. రెండేండ్లు ఈ కోర్సు డ్యురేషన్ ఉంటుంది. ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ కోర్సుకు అర్హులు. స్టయిఫండ్: నెలకు రూ.8000/- ఇస్తారు.
ఎంఎస్ (క్వాలిటీ మేనేజ్‌మెంట్ సైన్సెస్): ఈ కోర్సు బెంగళూరు, హైదరాబాద్ క్యాంపస్‌లలో నిర్వహిస్తున్నారు. మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా డిగ్రీలో ఉత్తీర్ణత లేదా ఏదైనా విభాగంలో బీటెక్ పూర్తిచేసి ఉండాలి. స్టయిఫండ్ నెలకు రూ.8 వేలు ఇస్తారు.
ఎంఎస్ (లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్): బెంగళూరు క్యాంపస్‌లో అందిస్తున్నారు. రెండేండ్లు కోర్సు డ్యురేషన్ ఉంటుంది. ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ కోర్సుకు అర్హులు. నెలకు రూ.8 వేల స్టయిఫండ్ ఇస్తారు.
ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్): కోల్‌కతా క్యాంపస్‌లో ఈ కోర్సు అందిస్తున్నారు. రెండేండ్ల కాలవ్యవధి ఉంటుంది. బీటెక్ లేదా ఇంటర్‌లో మ్యాథ్స్‌తో ఏదైనా పీజీ చేసినవారు ఈ కోర్సుకు అర్హులు.
ఎంటెక్ (క్రిప్టాలజీ అండ్ సెక్యూరిటీ-సీఆర్‌ఎస్): కోల్‌కతా క్యాంపస్‌లో కోర్సు అందిస్తున్నారు. 20 సీట్లు ఉన్నాయి. బీటెక్ లేదా ఇంటర్‌లో మ్యాథ్స్‌తో ఏదైనా పీజీ చేసిన విద్యార్థులు అర్హులు.
ఎంటెక్ (క్వాలిటీ, రిలయబిలిటీ అండ్ ఆపరేషన్ రిసెర్చ్-క్యూఆర్‌ఓఆర్): కోల్‌కతా క్యాంపస్‌లో కోర్సు అందుబాటులో ఉంది. 25 సీట్లు ఉన్నాయి. స్టాటిస్టిక్స్‌లో మాస్టర్ డిగ్రీ ఉండాలి. దీంతోపాటు ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి ఉండాలి. లేదా మ్యాథ్స్‌లో మాస్టర్ డిగ్రీతోపాటు డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా బీఈ/ బీటెక్ ఉండాలి.
జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్: స్టాటిస్టిక్స్, మ్యాథ్స్, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్, క్వాలిటీ రిలయబిలిటీ అండ్ ఆపరేషన్స్ రీసెర్చ్, ఫిజిక్స్ అండ్ అప్లయిడ్ మ్యాథ్స్, బయలాజికల్ సైన్స్, డెవలప్‌మెంట్ స్టడీస్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సబ్జెక్టుల్లో అవకాశం లభిస్తుంది. ఈ కోర్సులను కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, గిరిధ్ క్యాంపస్‌లో అందిస్తున్నాయి.
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అందిస్తున్న సంస్థలు: ఈ సంస్థలో కోర్సులు చేసినవారికి దాదాపు 100 శాతం ప్లేస్‌మెంట్స్ లభిస్తున్నాయి. ఏఐజీ, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, ఏఎన్‌జెడ్, యాక్సిస్ బ్యాంక్, ఏబీ ఇన్ వెబ్, ఏఎక్స్‌ఏ లైఫ్ ఇన్సూరెన్స్, బార్క్ ఇండియా, బీసీఎస్ టెక్నాలజీ, బ్లాక్‌రాక్, క్యాపిటల్ వన్, సిటీ బ్యాంక్, క్రిసిల్, సిబిల్, సిటీ కార్పొరేషన్, డెలాయిట్, డా.రెడ్డీస్ ల్యాబ్, దునియా ఫైనాన్స్, ఎఫ్‌ఐసీవో, గోల్డ్స్‌మన్‌సాచ్, మెట్రో, హెచ్‌ఎస్‌బీసీ, ఐబీఎం, ఐసీఐసీఐ, జేపీ మోర్గాన్, మహీంద్రా, మైక్రోసాఫ్ట్, నోవార్టిస్, టీసీఎస్, స్టాండర్డ్ చార్టెర్డ్, వాల్‌మార్ట్, సామ్‌సంగ్, నీల్‌సన్, రెడ్‌బస్, రిలయన్స్ తదితర ఎంఎన్‌సీలు.
అప్లికేషన్ ప్రాసెస్: అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో మార్చి 31వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. జనరల్ పురుషులకు రూ.1250/, జనరల్ మహిళలకు రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఓబీసీ (ఎన్‌సీఎల్) అభ్యర్థులకు రూ.625 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. – ఎగ్జామ్ మే 8వ తేదీన నిర్వహిస్తారు. పూర్తి సమాచారం కోసం వెబ్‌సైట్‌ను www.isical.ac.in సంప్రదించాలి.