HomeJOBSఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో.. స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాలు

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో.. స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాలు

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. తాజాగా వివిధ విభాగాల్లోని స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 127 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (SO) పోస్టులను భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 12 నుంచి అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. ఇందుకు అక్టోబర్ 3వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. పోస్టులను బట్టి విద్యార్హత నిర్ణయించారు. ఆన్‌లైన్ పరీక్ష ,పర్సనల్ ఇంటర్వ్యూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన వివరాలు:
పోస్టుల సంఖ్య: 127

పోస్టుల పేరు: స్పెషలిస్ట్ ఆఫీసర్స్

అధికారిక వెబ్‌సైట్: iob.in

విద్యార్హతలు:
పోస్టును బట్టి విద్యార్హత నిర్ణయించారు. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ, బీ.టెక్/బీ.ఈ, ఎం.ఎస్.సీ, ఎం.ఈ/ఎం.టెక్, ఎంబీఏ/పీజీడీఎం, ఎంసీఏ, పీజీడీబీఏ (సంబంధిత విభాగాల్లో) పూర్తి చేసి ఉండాలి.

జీతం:
ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం లభిస్తుంది.
MMGS II పోస్టులకు: ₹64,820 నుంచి ₹93,960 వరకు ఉంటుంది.

MMGS III పోస్టులకు: ₹85,920 నుంచి ₹1,05,280 వరకు ఉంటుంది.

అపక్లికేషన్ చివరి తేదీ: అభ్యర్థులు అక్టోబర్ 3 వ తేదీ వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి.

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.175 (జీఎస్టీతో కలిపి) అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

ఇతర అభ్యర్థులందరికీ (ఓబీసీ & ఈడబ్ల్యూఎస్ సహా) రూ.1000/- (జీఎస్టీతో కలిపి) ఫీజు ఉంటుంది.

ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్ పరీక్ష , పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here