ఇండియన్ నేవీ స్కిల్డ్ ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే.. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా వివిధ విభాగాల్లో నైపుణ్యం కలిగిన 1315 ట్రేడ్స్‌మెన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. సెప్టెంబర్ 2 వ తేదీ వరకు అభ్యర్థులు ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్ indiannavy.gov.in ద్వారా ఆన్‌లైన్ విధానంలో ఈ పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు.
ముఖ్య వివరాలు:
పోస్ట్ పేరు: స్కిల్డ్ ట్రేడ్స్‌మెన్
మొత్తం ఖాళీలు: 1,315
చివరి తేదీ: అభ్యర్థులు సెప్టెంబర్ 2 వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
అర్హతలు:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు నిర్దిష్ట అర్హతలను కలిగి ఉండాలి.
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ ఉత్తీర్ణత, సంబంధిత ట్రేడ్‌లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ITI) సర్టిఫికేట్ ఉండాలి.
వయస్సు: అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వంటి రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
ఈ రిక్రూట్‌మెంట్ కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
జీతం:
ఎంపికైన అభ్యర్థులకు ఏడవ వేతన సంఘం (7th Pay Commission) ప్రకారం జీతం లభిస్తుంది. జీతం రూ. 19,900/- నుంచి రూ. 63,200/- వరకు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ & అప్లికేషన్ విధానం:
ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ వంటివి ఉంటాయి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ indiannavy.gov.in సంప్రదించవచ్చు.





