భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన ఇండియన్ నేవీ జనరల్ సెంట్రల్ సర్వీస్ విభాగంలో గ్రూప్ సీ నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది. మొత్తం 1531 ఖాళీలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
పోస్టులు: ఎలక్ట్రికల్ ఫిట్టర్, ఎలక్ట్రోప్లేటర్, ఇంజిన్ ఫిట్టర్, ఫౌండ్రీ, ఇనుస్ట్రుమెంట్ ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్, రాడార్ ఫిట్టర్, రేడియో ఫిట్టర్, రిగ్గర్, వెపన్ ఫిట్టర్, షిప్ ఫిట్టర్, బాయిలర్ మేకర్, పెయింటర్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటిస్‌షిప్‌తో పాటు ఇంగ్లిష్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంప్లాయిమెంట్ న్యూస్ (2022 ఫిబ్రవరి 19 నుంచి 25)లో పూర్తి వివరాలు అందజేస్తారు.
వెబ్సైట్: www.joinindiannavy.gov.in