ఇండియన్ నేవీ.. స్పెషల్ నావల్ ఓరియంటేషన్ కోర్సు కింద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) ఆఫీసర్ పోస్టుల భర్తీకి అవివాహిత స్త్రీ, పురుషుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 50
ట్రైనింగ్ సెంటర్: ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఏ), ఎజిమళ, కేరళ.
అర్హత: కనీసం 60% మార్కులతో కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ ఐటీలో బీఈ/ బీటెక్ (లేదా) ఎమ్మెస్సీ (కంప్యూటర్/ ఐటీ)/ ఎంసీఏ/ ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ) ఉత్తీర్ణత.
వయసు: 2 జులై 1997 నుంచి 1 జనవరి 2003 మధ్య జన్మించి ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: కోవిడ్-19 కారణంగా ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించకుండా అకడమిక్ మెరిట్ ద్వారా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.
దరఖాస్తులు: ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్స్ ప్రారంభం: 27 జనవరి
చివరితేది: 10 ఫిబ్రవరి
క్యాడెట్ ఎంట్రీ స్కీమ్
ఇండియన్ నేవీ 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (పర్మినెంట్ కమిషన్) కింద ఎజిమళ (కేరళ) నేవల్ అకాడమీ అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌లో అడ్మిషన్స్‌కు అప్లికేషన్స్ కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులకు బీటెక్ డిగ్రీతోపాటు ఉద్యోగం కల్పిస్తారు.
ఖాళీలు: 35 (ఎడ్యుకేషన్ బ్రాంచ్- 5, ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్-30)
అర్హత: 70శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (10+2) (ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) ఉత్తీర్ణత. జేఈఈ మెయిన్-2021కు హాజరై ఉండాలి.
వయసు: 2 జనవరి 2003 నుంచి 1 జులై 2005 మధ్య జన్మించి ఉండాలి.
సెలెక్షన్: జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా మెరిట్ ర్యాంకు ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారిని ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు: మార్చి-ఏప్రిల్ 2022.
దరఖాస్తులు: ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.
చివరి తేది: 8 ఫిబ్రవరి
కోర్సు ప్రారంభం: జులై 2022.
వెబ్సైట్: www.joinindiannavy.gov.in