ఇండియన్ నేవీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 260 షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. బి.టెక్, ఎం.టెక్, ఎమ్మెస్సీ, ఎంబీఏ వంటి అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. జనవరి 24 నుంచి ఆన్‌లైన్‌లో అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నోటిఫికేఫన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి వివరాలు:
మొత్తం ఉద్యోగాలు: 260
గ్జిక్యూటివ్ బ్రాంచ్:
జనరల్ సర్వీస్ – 76
పైలట్- 25
నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ – 20
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ -18
లాజిస్టిక్స్- 10
ఎడ్యుకేషన్ బ్రాంచ్: 07
జనరల్ సర్వీస్ -42
సబ్ మెరైన్ టెక్ ఇంజనీరింగ్ -08
ఎలక్ట్రికల్ బ్రాంచ్:
జనరల్ సర్వీస్ -38
సబ్ మెరైన్ టెక్ ఎలక్ట్రికల్- 08
అర్హతలు:
అభ్యర్థులు సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతో బీఈ/బీటెక్ పూర్తి చేసి ఉండాలి. కొన్ని పోస్టులకు.. ఎంబీఏ, ఎంసీఏ చేసిన వారు కూడా అర్హులు.
వయస్సు: అభ్యర్థులు 02 జనవరి 2002 నుంచి 01 జూలై 2007 మధ్య జన్మించి ఉండాలి (పోస్టును బట్టి మార్పులు ఉంటాయి).
ఎంపిక విధానం :
షార్ట్‌లిస్టింగ్: అభ్యర్థులను డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.
SSB ఇంటర్వ్యూ: షార్ట్‌లిస్ట్ అయిన వారికి ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన సమాచారం ఈమెయిల్ లేదా మెసేజ్ ద్వారా అందుతుంది.
మెడికల్ ఎగ్జామినేషన్: ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు.
మెరిట్ లిస్ట్: SSB మార్కులు, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా ఫైనల్ లిస్ట్ తయారు చేస్తారు.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభ తేదీ: జనవరి 24 నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
చివరి తేదీ: ఫిబ్రవరి 24 వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అప్లికేషన్ విధానం:
అర్హులైన అభ్యర్థులు joinindiannavy.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.





