ఇండియన్ నేవీలో ఉద్యోగం చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఇండియన్ నేవీ.. ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 260 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టులు – 240
ఈ పోస్టులు ప్రధానంగా ఎగ్జిక్యూటివ్, టెక్నికల్, ఎడ్యుకేషన్ విభాగాలలో ఉన్నాయి.
- ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్:
ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (GS(X)/హైడ్రో కేడర్): 57 పోస్టులు
పైలట్: 24 పోస్టులు
నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ (అబ్జర్వర్): 20 పోస్టులు
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC): 20 పోస్టులు
లాజిస్టిక్స్: 10 పోస్టులు
నావల్ ఆర్మమెంట్ ఇన్స్పెక్టరేట్ కేడర్ (NAIC): 20 పోస్టులు
లా: 2 పోస్టులు
- టెక్నికల్ బ్రాంచ్: టెక్నికల్ పోస్టుల కోసం బీ.టెక్ లేదా బీ.ఈ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
- ఎడ్యుకేషన్ బ్రాంచ్: ఎడ్యుకేషన్ బ్రాంచ్‌కు సంబంధించిన పోస్టుల కోసం బీ.టెక్, ఎం.టెక్, ఎం.ఎస్సీ వంటి విద్యార్హతలు ఉండాలి.
విద్యార్హతలు:
పోస్టును బట్టి విద్యార్హత మారుతుంది. సాధారణంగా కనీసం 60% మార్కులతో ఇంజనీరింగ్ (బీ.ఈ/బీ.టెక్), బీ.ఎస్సీ, బీ.కాం, ఎం.బీ.ఏ, ఎం.సీ.ఏ, ఎం.ఎస్సీ వంటి డిగ్రీలు పూర్తి చేసి ఉండాలి. కొన్ని పోస్టులకు చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ వారు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయానికి డిగ్రీ పూర్తి చేసినట్లు రుజువు చేయాలి.
వయస్సు:
పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది. అభ్యర్థులు 02 జులై 2001 నుంచి 01 జనవరి 2007 మధ్య జన్మించి ఉండాలి.
జీతం:
ఎంపికైన అభ్యర్థులకు సుమారుగా నెలకు రూ. 56,100తో పాటు ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి.
ఎంపిక విధానం:
షార్ట్ లిస్ట్: అభ్యర్థుల డిగ్రీ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
ఇంటర్వ్యూ: షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (SSB) ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
మెడికల్ టెస్ట్ : ఇంటర్వ్యూలో అర్హత సాధించిన వారికి మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.
ఫైనల్ మెరిట్ లిస్ట్: SSB మార్కులు, మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
అప్లికేషన్ విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు ఇండియన్ నేవీ అధికారిక వెబ్సైట్ joinindiannavy.gov.inలోకి లాగిన్ అవ్వాలి.
అవసరం అయిన వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
అనంతరం పోస్టు వివరాలు, విద్యార్హతలకు సంబంధించిన వివరాలు జాగ్రత్తగా ఎంటర్ చేయాలి.
అవసరమైన అన్ని డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
అప్లికేషన్ ఫారమ్ సబ్మిట్ చేసిన తర్వాత, దాని ప్రింట్అవుట్ తీసుకోవడం మంచిది.





