Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSభారత నేవీలో 242 SSC ఆఫీసర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..అప్లై చేయండిలా..

భారత నేవీలో 242 SSC ఆఫీసర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..అప్లై చేయండిలా..

భారత త్రివిధ దళాల్లో ఒకటైన నేవీ 242 షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు ఏప్రిల్ 29న నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ joinindiannavy.govt.in లో మే 14లోపు అప్లై చేసుకోవచ్చు. ఎంపికయ్యే అభ్యర్థులు 10 సంవత్సరాల పాటు షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్‌గా సేవలిందించాల్సి ఉంటుంది. సర్వీస్ రిక్వైర్మెంట్స్, పనితీరు, మెడికల్ ఎలిజిబిలిటీ, అభ్యర్థుల ఇష్టాన్ని బట్టి గరిష్టంగా 4 సంవత్సరాలకు సర్వీస్ పొడిగించవచ్చు.

Advertisement

విభాగాల వారీగా ఖాళీలు ఇవే..

జనరల్ సర్వీస్- 50, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్- 10, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్- 20, పైలట్ – 25, లాజిస్టిక్స్ – 30, నావల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టరేట్ కేడర్ – 15, ఎడ్యుకేషన్ – 12, ఇంజనీరింగ్ బ్రాంచ్ జీఎస్ – 20, ఎలక్ట్రికల్ బ్రాంచ్ జీఎస్- 60.

ఈ పోస్టుల్లో 150 ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌, 12 ఎడ్యుకేషన్ బ్రాంచ్‌, మరియు 80 టెక్నికల్ బ్రాంచ్‌ లో ఖాళీలు ఉన్నాయి.

Advertisement

విద్యార్హతలు:

గుర్తింపు పొందిన యూనివర్సిటి నుండి UG, PG డిగ్రీలో కనీసం 60శాతం మార్కులతో పాసై ఉండాలి. అలాగే ఫైనలియర్ విద్యార్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ఎంపిక ప్రక్రియ:

Advertisement

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశలో డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. రెండో రౌండ్‌లో ఇంటర్వ్యూ, మూడో దశలో మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.

అప్లికేషన్ ప్రాసెస్:

ముందుగా అధికారిక పోర్టల్ www.joinindiannavy.gov.in విజిట్ చేయాలి. హోమ్ పేజీలోకి వెళ్లి షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అవసరమైన వివరాలతో రిజిస్టర్ అవ్వాలి. ఆ తరువాత లాగిన్ అయి అప్లికేషన్‌ను ఫిలప్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. చివరగా అప్లికేషన్ ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫారమ్‌ను సబ్‌మిట్ చేయాలి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!