భారత నౌకాదళంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియన్ నేవీ నావల్ సివిలియన్ గ్రూప్ B , గ్రూప్ C పోస్టుల భర్తీకి సంబంధించి INCET 01/2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,110 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు.
ముఖ్య వివరాలు:
నోటిఫికేషన్ నంబర్: INCET 01/2025
మొత్తం పోస్టులు: 1110.
పోస్టుల వివరాలు:
గ్రూప్ B (నాన్-గెజిటెడ్)
గ్రూప్ C (నాన్-గెజిటెడ్)
పోస్టులు: చార్జ్‌మన్, ట్రేడ్స్‌మన్ మేట్, ఫైర్‌మన్, స్టోర్‌కీపర్, డ్రైవర్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS), పెస్ట్ కంట్రోల్ వర్కర్, సైంటిఫిక్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్‌మన్, ఇతర పోస్టులు.
అధికారిక వెబ్‌సైట్: indiannavy.gov.in లేదా incet.cbt-exam.in
అర్హత ప్రమాణాలు:
విద్యార్హత:
పోస్టులను బట్టి విద్యార్హత మారుతుంది. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేదా మ్యాథమెటిక్స్‌తో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్) వంటి విద్యార్హతలు అవసరం.
వయస్సు: 18 నుంచి 25 సంవత్సరాలు (జులై 18, 2025 నాటికి). ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, OBC, PwBD, మాజీ సైనికులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ప్రక్రియ:
అప్లికేషన్ తేదీలు: జులై 5- జులై 18, 2025 వరకు.
అప్లికేషన్ విధానం:
అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు:
జనరల్, OBC అభ్యర్థులకు రూ. 295 .SC, ST, PwBD, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫీజు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
అప్లికేషన్ విధానం :
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ indiannavy.gov.in లేదా incet.cbt-exam.in లోకి లాగిన్ అవ్వాలి.
- “Apply Online” లింక్‌పై క్లిక్ చేసి, కొత్త యూజర్ అకౌంట్ తయారు చేసుకోవాలి.
- లాగిన్ చేసి, అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తి చేయండి. వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, అవసరమైన డాక్యుమెంట్లు (ఫోటో, సంతకం, ID ప్రూఫ్) అప్‌లోడ్ చేయండి.
- ఫీజు చెల్లించి, అప్లికేషన్స సబ్మిట్ చేయండి.
- అప్లికేషన్ ఫారమ్ ప్రింటవుట్ తీసుకోండి.
ఎంపిక విధానం:
ఎంపిక విధానంలో కింది దశలు ఉంటాయి:
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT):
100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.
సమయం: 90 నిమిషాలు.
భాష: ఇంగ్లీష్, హిందీ (జనరల్ ఇంగ్లీష్ మినహా).
2. స్కిల్ టెస్ట్: కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
3.డాక్యుమెంట్ వెరిఫికేషన్: షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం హాజరు కావాల్సి ఉంటుంది.
4. మెడికల్ ఎగ్జామినేషన్: అభ్యర్థులు మెడికల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభ తేదీ: జులై 5, 2025.
అప్లికేషన్ చివరి తేదీ: జులై 18, 2025.
పరీక్ష తేదీ: అధికారిక వెబ్‌సైట్‌లో త్వరలో ప్రకటిస్తారు.
My dream
My dream job
Chuttugulla Praveen Kumar