HomeLATESTఅక్టోబర్​ 16న ఐఈఎస్: సెప్టెంబర్​ 1 వరకు అప్లికేషన్లు​

అక్టోబర్​ 16న ఐఈఎస్: సెప్టెంబర్​ 1 వరకు అప్లికేషన్లు​

యూపీఎస్సీ ఇండియ‌న్ ఎక‌న‌మిక్ స‌ర్వీసెస్(ఐఈఎస్‌) ఎగ్జామినేష‌న్-2020 నోటిఫికేష‌న్ రిలీజ్​ చేసింది. ఆగస్టు 11 నుంచి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. సెప్టెంబర్​ ఒకటో తేదీ వరకు అప్లికేషన్లకు తుది గడువుగా ప్రకటించింది. ఐఈఎస్​ ప‌రీక్ష‌ను అక్టోబ‌ర్‌లో నిర్వ‌హిస్తామ‌ని యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇప్పటికే ప్ర‌క‌టించింది. జూన్ 10న ఐఈఎస్, ఐఎస్ఎస్ (ఇండియ‌న్ స్టాటిస్టిక‌ల్ స‌ర్వీస్‌) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. కానీ ఐఈఎస్​ పోస్టులు ఖాళీగా లేవని, ఈ ఏడాది ప‌రీక్ష‌ను ర‌ద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కోరిక మేరకు ఇప్పుడు ఐఈఎస్‌కు సంబంధించిన నోటిఫికేషన్​ విడుదల చేసింది. అక్టోబ‌ర్ 16 నుంచి 18 వ‌ర‌కు ఈ పరీక్ష నిర్వహించనుంది. గతంలో మాదిరిగానే ఐఈఎస్, ఐఎస్ఎస్ ప‌రీక్ష‌ల‌ను ఒకేసారి నిర్వ‌హించ‌నుంది.
అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం https://www.upsc.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

Advertisement
  • ఇండియ‌న్ ఎక‌న‌మిక్ స‌ర్వీసెస్ ఎగ్జామినేష‌న్‌(ఐఈఎస్‌) – 2020
  • అర్హ‌త‌: ఎక‌న‌మిక్స్‌/ అప్లయిడ్‌ ఎక‌న‌మిక్స్‌/ బిజినెస్ ఎక‌న‌మిక్స్‌/ ఎక‌నామెట్రిక్స్‌లో పోస్టు గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త.
  • వ‌య‌సు: ఆగస్టు 1, 2020 నాటికి 21-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
  • ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, వైవా ఆధారంగా.
  • ప‌రీక్ష తేది: అక్టోబ‌రు16 నుంచి అక్టోబర్‌ 18 వరకు.
  • అప్లికేషన్లకు తుది గడువు; సెప్టెంబర్‌ 01, 2020, ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి
  • అప్లై ఫీజు: రూ.200 (ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఫీజు లేదు)
  • వెబ్‌సైట్‌:https://www.upsc.gov.in/

యూపీఎస్సీ నోటిఫికేషన్​ పూర్తి వివరాలు


Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!