ఇండియన్ బ్యాంకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.మొత్తం 102 పోస్టుల్లో డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ 30 పోస్టులు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ 72 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ, కోర్సు సర్టిఫికేట్, పీజీ, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు 40 ఏళ్లు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు 38 ఏళ్లు ఉండాలి.
సెలెక్షన్: రాత పరీక్ష/ ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. ఆన్లైన్లో జులై 14 వరకు దరఖాస్తు చేసుకోవాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. వివరాలకు www.ibpsonline.ibps.in వెబ్సైట్లో సంప్రదించాలి.