ఇండియన్ ఆర్మీకి చెందిన చెన్నైలోని ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ 2022 (అక్టోబరు) సంవత్సరానికి 59వ షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) మెన్, 30వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) ఉమెన్ కోర్సు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయిన అవివాహిత పురుషులు, మహిళలు, డిఫెన్స్ పర్సనల్ విడోస్ నుంచి అప్లికేషన్స్ కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఏప్రిల్ 6వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం 191 ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఎస్ఎస్సీ (టెక్) మెన్ 175, ఎస్ఎస్సీ (టెక్) ఉమెన్ 14, విడోస్ డిఫెన్స్ పర్సనల్ 2 పోస్టులు ఉన్నాయి. సివిల్/ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, మెకానికల్, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, టెలీకమ్యూనికేషన్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
అర్హత: ఎస్ఎస్సీ(టెక్) మెన్/ ఉమెన్ – సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ, ఎస్ఎస్సీ విడోస్ (నాన్ టెక్నికల్)(నాన్ యూపీఎస్సీ)- ఏదైనా గ్రాడ్యుయేషన్, ఎస్ఎస్సీ విడో (టెక్నికల్)- బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు ఎస్ఎస్సీ (టెక్) మెన్/ ఉమెన్ 20- నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్ఎస్సీ విడోస్ (నాన్ టెక్నికల్)(నాన్ యూపీఎస్సీ), ఎస్ఎస్సీ విడో (టెక్నికల్)- 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. ఆభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఏప్రిల్ 6వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ www.joinindianarmy.nic.in సంప్రదించాలి.