Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఇంటర్ అర్హతతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగాలు

ఇంటర్ అర్హతతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగాలు

నిరుద్యోగులకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శుభవార్త చెప్పింది. ఇంటర్ అర్హతతో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సంస్థ ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్ లో మొత్తం 317 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే దరఖాస్తులు మే 30 నుంచి ప్రారంభం కానున్నాయి. అర్హత ఉన్నవారు జూన్ 26 వరకు అధికారిక వెబ్ సైట్ afcat.cdac.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్టు రాయాల్సి ఉంటుంది. కనీసం 50శాతం మార్కులతో ఇంటర్ పూర్తి చేసినవారు మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థులు తప్పనిసరిగా మ్యాథ్స్, ఫిజిక్స్ తోపాటు సైన్స్ స్ట్రీమ్ లో ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. పలు పోస్టులకు విద్యార్హతలు వేరువేరుగా ఉంటాయి. ఎఎఫ్ సీఏటీ పరీక్షలో ఉత్తీర్ణతసాధించిన వారిని భారత వైమానిక దళంలోని ఫ్లయింగ్ బ్రాంచ్, ఇతర బ్రాంచులకు సెలక్ట్ చేస్తారు.

గ్రౌండ్ డ్యూటీ పోస్టులు:
గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ పోస్టులకు ఇంటర్ లెవల్‌లో 50 శాతం మార్కులు ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్/టెక్నాలజీలో కనీసం 4ఏండ్ల గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. కనీసం 60శాతం మార్కులతో ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) లేదా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అసోసియేట్ మెంబర్‌షిప్ సెక్షన్ A అండ్ B ఎగ్జామ్స్ రాలి ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ విభాగంలో మొత్తం 5 బ్రాంచుల్లో పోస్టులు ఉండగా…పోస్టులను బట్టి విద్యార్హతలు వేరువేరుగా ఉన్నాయి.

ఫ్లయింగ్ బ్రాంచ్ పోస్టులు:
ఫ్లయింగ్ బ్రాంచ్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి, అభ్యర్థి 12వ తరగతిలో సైన్స్ స్ట్రీమ్ (మ్యాథ్స్, ఫిజిక్స్) 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీంతో పాటు గ్రాడ్యుయేషన్‌లో ఏదైనా స్ట్రీమ్‌లో 60 శాతం మార్కులు రావాలి. లేదా 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ పాస్ అయినవారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. లేదా 60శాతం మార్కులతో ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) లేదా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అసోసియేట్ మెంబర్‌షిప్ సెక్షన్ A అండ్ B ఎగ్జామ్ పూర్తి చేయాలి.

వయస్సు:
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ బ్రాంచ్ రెక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయస్సు 20- 24ఏండ్ల మధ్య ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్ పోస్టులకు ఏజ్ లిమిట్ 20-26ఏండ్లు.

జీతం:
ఈ పోస్టులకు ఎంపికైన వారికి జీతం రూ. 56,100 నుంచి రూ.1,77,500 మధ్య ఉంటుంది.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!