పదో తరగతి విద్యార్హతతో ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఐఏఆర్‌ఐ) 641 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆన్‌లైన్ ఎగ్జామ్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా రిక్రూట్మెంట్ చేస్తారు. ఎంపికైనవారు లెవెల్-3 వేతనం అందుకోవచ్చు.
ఏడాది ట్రైనింగ్… జీతం రూ.35 వేలు
దేశవ్యాప్తంగా 64 ఐసీఏఆర్ కేంద్రాలు ఉన్నాయి. ఖాళీలను ఆయా కేంద్రాల వారీగా భర్తీ చేస్తారు. అయితే వీటికి ఎవరైనా పోటీ పడవచ్చు. ఎంపికైనవారికి ఏడాది పాటు శిక్షణ నిర్వహిస్తారు. ఈ వ్యవధిలో వీరిని టెక్నికల్ ట్రైనీగా పరిగణిస్తారు. దాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి టెక్నీషియన్-1 హోదా కేటాయిస్తారు. వీరికి లెవెల్-3 కేంద్ర వేతనం అందుతుంది. అంటే రూ.21700 మూలవేతనానికి అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. మొదటి నెల నుంచే రూ.35 వేలకు పైగా వేతనం అందుకోవచ్చు.
ఎగ్జామ్ ప్యాటర్న్
ఆన్‌లైన్‌లో వంద మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్, హిందీ మీడియంలో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మొత్తం వంద ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. వీటిని 4 విభాగాల నుంచి అడుగుతారు. జనరల్ నాలెడ్జ్, మ్యాథమేటిక్స్, సైన్స్, సోషల్ సైన్సెస్‌లో ఒక్కో విభాగం నుంచి 25 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. తప్పు సమాధానానికి పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. పరీక్షలో అర్హత సాధించాలంటే యూఆర్‌లు 40, ఎస్సీ, ఓబీసీ ఎన్‌సీఎల్, ఈడబ్ల్యుఎల్‌లు 30, ఎస్టీలు 25 మార్కులు పొందడం తప్పనిసరి.
సిలబస్
జనరల్ నాలెడ్జ్: వర్తమానాంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా భారత్, పొరుగు దేశాలకు సంబంధించి అడుగుతారు. చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ, ఎకనామిక్ సైన్స్, జనరల్ పాలసీ అండ్ సైంటిఫిక్ రిసెర్చ్ విభాగాల్లో వీటిని అడుగుతారు. గత 9 నెలల ముఖ్యాంశాలను బాగా చదువుకుంటే సరిపోతుంది.
మ్యాథ్స్: ఈ విభాగంలో ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటాయి. నంబర్ సిస్టమ్, అరిథ్‌మెటికల్ ఆపరేషన్స్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగనోమెట్రీ, స్టాటిస్టికల్ చార్టుల నుంచి వీటిని అడుగుతారు.
సైన్స్: ఈ ప్రశ్నలూ పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. ఫిజికల్ కెమికల్ సబ్ స్టాన్సెస్- నేచర్ అండ్ బిహేవియర్, వరల్డ్ ఆఫ్ లివింగ్, నేచురల్ ఫినామినన్, నేచురల్ రిసోర్సెస్ అంశాల్లో ఇవి ఉంటాయి.
సోషల్ సైన్స్: ఇవీ పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. భారత దేశం, ప్రపంచానికి సంబంధించి ఆర్థిక రాజకీయ అంశాలు, అభివృద్ధి, విపత్తు నిర్వహణ మొదలైన వాటిలో ప్రశ్నలుంటాయి.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
చివరితేది: 20 జనవరి
ఎగ్జామ్స్: జనవరి 25 నుంచి ఫిబ్రవరి 5 వరకు ఉంటాయి.
పరీక్ష కేంద్రాలు:హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు రూ.300. మిగిలిన అందరికీ రూ.వెయ్యి.
ఖాళీలు: మొత్తం 641 ఉన్నాయి. వీటిలో 286 అన్ రిజర్వ్‌డ్, 61 ఈడబ్ల్యుఎస్, 93 ఎస్సీ, 68 ఎస్టీ, 133 ఓబీసీ (ఎన్‌సీఎల్)కు కేటాయించారు.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత
వయసు: జనవరి 10, 2022 నాటికి కనిష్టంగా 18 నుంచి గరిష్టంగా 30 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.
వెబ్‌సైట్: www.iari.res.in
టెన్త్‌తో ఐఏఆర్ఐలో టెక్నీషియన్ పోస్టులు
RELATED ARTICLES
PRACTICE TEST
TELANGANA HISTORY
LATEST
CURRENT AFFAIRS
TELANGANA MAGAZINE
తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.





