Homeస్టడీటాప్​ ఆర్టికల్స్​హెచ్‌డీఐలో ఇండియాకు 131వ ర్యాంకు

హెచ్‌డీఐలో ఇండియాకు 131వ ర్యాంకు

యునైటెడ్ నేషన్స్​ డెవలప్​మెంట్ ప్రోగ్రాం(యూఎన్​డీపీ) విడుదల చేసిన మానవ అభివృద్ధి సూచిలో (Human Development Index)​ ర్యాంకింగ్​లో ఇండియా 131వ స్థానంలో నిలిచింది. నార్వే మొదటి స్థానంలో ఉంది.

HDIలో టాప్-10 దేశాలు

ర్యాంక్‌ దేశం హెచ్‌డీఐ విలువ ఆయుర్దాయం
1 నార్వే 0.95782.4
2 ఐర్లాండ్​ 0.95582.3
2స్విట్జర్లాండ్ 0.955 83.8
4 హాంగ్​కాంగ్, చైనా(ఎస్​ఏఆర్​)0.949 84.9
4 ఐస్​లాండ్​ 0.949 83.0
6 జర్మనీ 0.947 81.3
7 స్వీడన్‌0.945 82.8
8 ఆస్ట్రేలియా 0.944 83.4
8 నెదర్లాండ్స్‌ 0.944 82.3
10 డెన్మార్క్​ 0.940 80.9

ఆయా దేశాల ప్రజల ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలపై ఆధారపడి మానవ అభివృద్ధి సూచికను యూఎన్​డీపీ అంచనా వేస్తుంది. 2019 లో ఇండియా హెచ్​ డీఐ వాల్యూ 0.645తో మీడియం హ్యూమన్ డెవలప్‌మెంట్ విభాగంలో నిలిచింది. గత ఏడాది ఇండియాకు 129వ ర్యాంకు రాగా.. ఈ సారి రెండు ర్యాంకులకు దిగువకు వెళ్లింది. ప్రపంచంలోని 189 దేశాలకు ఇచ్చిన ర్యాంకింగ్స్​ లో గత ఏడాదిలాగే నార్వే మళ్లీ తొలి స్థానంలో నిలవడం విశేషం.

మన పొరుగు దేశాల ర్యాంకింగ్స్​..
మనకు పొరుగునే ఉన్న భూటాన్ 2019లో 134వ స్థానంలో ఉండగా​ ఈ ఏడాది 129వ స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాది 147 వ స్థానంలో నిలిచిన నేపాల్ 142 వ ర్యాంకుకు చేరుకుంది. ఆఫ్ఘనిస్తాన్ 170 నుంచి 169 వ స్థానానికి, బంగ్లాదేశ్ 135 నుంచి 133 వ ర్యాంకుకు చేరింది. గత ఏడాది 152వ స్థానంలో ఉన్న పాకిస్థాన్​ 154వ ర్యాంకుతో రెండు ర్యాంకుల దిగువకు చేరింది. శ్రీలంక 72వ స్థానంలో ఉంది. ఈ విషయమై యూఎన్‌డీపీ రెసిడెంట్ ప్రతినిధి షోకో నోడా మాట్లాడుతూ “ఇండియా ర్యాంకింగ్‌లో కిందిపడిపోవడం అంటే ఆ దేశం బాగా చేయలేదని కాదని, ఇతర దేశాలు మెరుగ్గా చేయడం వల్ల ముందుకుకొచ్చాయని పేర్కొన్నారు. భారతదేశం ఇతర దేశాలకు కూడా సాయం చేయగలదన్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించడంలో ఇండియా ప్రదర్శించిన నిబద్ధతను ఆయన ప్రశంసించారు.

బాలికల్లో పోషకాహార లోపం..
ఇండియాలో బాలికల ఆరోగ్యం, విద్యపై ఖర్చు విషయంలో తల్లిదండ్రుల ప్రవర్తనలో భిన్నమైన ప్రతిస్పందనలు వ్యక్తమయ్యాయని, వీరిపై తక్కువగా ఇన్వెస్ట్ చేయడం వల్ల అబ్బాయిల కంటే బాలికల్లో పోషకాహార లోపం ఎక్కువ ఉందని యూఎన్​ నివేదిక పేర్కొంది. ఇండియా, పాకిస్థాన్​ లో ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది.

క్లయిమెంట్ చేంజ్​పై యాక్షన్​ ప్లాన్​
2008 లో క్లయిమెట్ చేంజ్​ పై భారతదేశం నేషనల్​ యాక్షన్​ ప్లాన్​ ను ప్రారంభించింది. 2005 స్థాయి నుంచి 2030 నాటికి 33-35 శాతం కర్బన ఉద్గారాలను తగ్గిస్తామని, 2030 నాటికి శిలాజ ఇంధన ఆధారిత విద్యుత్ కు ప్రత్యామ్నాయంగా సోలార్​ పవర్ ప్రొడక్షన్​ సామర్థ్యాన్ని 40 శాతానికి పెంచాలని పారిస్​ అగ్రిమెంట్ లో ఇండియా ప్రతిజ్ఞ చేసినట్లు నివేదిక పేర్కొంది. యాక్షన్​ ప్లాన్​ లో భాగంగా 2014 మార్చి నాటికి 2.6 గిగా వాట్స్​ ఉన్న సోలార్​ పవర్​ సామర్థ్యాన్ని 2019 జూలై వరకు 30 గిగా వాట్స్​ కు పెంచింది. సోలార్​ పవర్​ ఉత్పత్తి సామర్థ్యంలో ఇండియా 2019 సంవత్సరానికి ఐదో స్థానంలో నిలిచింది.

ఇండియాను ముంచెత్తిన విపత్తులు
2019లో తీవ్ర కరువు దుర్భిక్షం వల్ల ఇండియాలో కోటి మందికి తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొన్నారు. నీళ్ల కోసం వీధి పోరాటాలు జరిగాయి. గడిచిన 25 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఆ ఏడాది వరదలు, విపత్తుల కారణంగా దేశవ్యాప్తంగా సుమారు 1600 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల కారణంగా అత్యధికంగా కేరళలో లక్ష మందికిపైగా నిరాశ్రయులయ్యారు. ఇండియాలో టెక్ట్స్​ బుక్స్​లో చెప్పే పర్యావరణ విద్యకు, ప్రజల వ్యక్తిగత బాధ్యతకు అంతరం చాలా ఉందని, మెక్సికోలోనూ ఇలాగే ఉందని హెచ్​ డీఆర్​ రిపోర్ట్​ వెల్లడించింది.

కేరళ కుడుంబశ్రీ మిషన్ కు యూఎన్​ ప్రశంసలు..
మహిళల నేతృత్వంలో స్థానికంగా అనేక కార్యక్రమాలు విజయవంతమయ్యాయని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది. కేరళలో పేదరిక నిర్మూలనకు అమలు చేస్తున్న కుడుంబశ్రీ మిషన్​ మోడల్ ను ఇందుకు ఉదాహరణ అని ప్రశంసించింది. స్వయం నిర్ణయాధికారంలో, లీడర్​ షిప్​లో కుడుంబశ్రీ ప్రాజెక్ట్ మహిళా రైతులు, మత్స్యకారుల సాధికారతను ఈ రిపోర్ట్​ ఎత్తి చూపింది. ఈ మిషన్​ ను మలప్పురంలో 1998లో అప్పటి ప్రధాని ఏబీ వాజ్​పాయ్​ ప్రారంభించారు. మలయాళంలో కుడుంబశ్రీ అంటే ‘కుటుంబ శ్రేయస్సు’ అని అర్థం.

భూమి హక్కుతోనే మహిళలకు భద్రత
మహిళలు భూమిని కలిగి ఉండటం వల్ల వారి సామాజిక, ఆర్థిక భద్రత మరింత మెరుగవుతుందని, జండర్​ ఆధారిత హింస తగ్గుతుందని యూఎన్​డీపీ నివేదిక పేర్కొంది. కరోనా మహమ్మారి ద్వారా మానవ అభివృద్ధికి పెద్ద షాక్​ గా పరిణమించిందని, 2030 నాటి సుమారు 90 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది.

11.8 ఏళ్లు పెరిగిన ఆయుర్దాయం
రెండున్నర దశాబ్దాల కింద అంటే 1990లో భార‌త్‌లో పుట్టుక సమయంలో ఆయుర్దాయం (Life Expectancy at birth) 57.9 సంవత్సరాలు ఉండ‌గా 20120లో అది 11.8 సంవత్సరాలు పెరిగి 69.7 కు చేరింది. ఈ విషయంలో మనకంటే వందకుపైగా దేశాలు ముందున్నాయి. 84.9 ఏళ్లతో హాంగ్ కాంగ్​ ప్రజలు ప్రపంచంలో అత్యధిక ఆయురార్ధం కలిగి ఉన్నారు. జపాన్​ ప్రజలు 84.6 ఏళ్లతో రెండో స్థానంలో ఉన్నాయి. ఇది ఆరోగ్యం విషయంలో మన వెనుకబాటుతనాన్ని గుర్తు చేస్తుంది. భారత్‌లో పురుషుల (68.5) కంటే మహిళల ఆయుర్దాయం(71) రెండున్నరేళ్లు ఎక్కువగా ఉండటం సంతోషకరమైన విషయమే అయినా మహిళలపై పత్యేక శ్రద్ద తీసుకోవాల్సిన అవసరం ఉందని నివేదిక తెలిపింది. జాబితాలో అగ్రస్థానంలో ఉన్న నార్వేలో ఆయుర్దాయం 82.4 సంవ‌త్సరాలు కాగా స‌గ‌టు పాఠ‌శాల‌లో గ‌డిపే వ‌య‌సు 18.1 సంవ‌త్సరాలుగా ఉంటుంది. చివరిస్థానంలో ఉన్న దేశం నైగ‌ర్‌లో పుట్టిన పిల్లవాడు 62.4 సంవ‌త్సరాలు బతికే అవకాశం ఉండగా సగటున పాఠశాలలో గడిపే సమయం కేవ‌లం 6.5 సంవత్సరాలు మాత్రమే. ఇలాంటి తేడాలు దేశాలు మెరుగైన అభివృద్ధి చర్యలు తీసుకోవాల్సిన విషయాన్ని నొక్కి చెబుతున్నాయి.

1990 – 2019 మధ్య భారత్ హెచ్‌డీఐ స్కోర్ 50 శాతం పెరుగుదలను నమోదు చేస్తూ 0.427 నుంచి 0.645 కు పెరగటం పేదరిక నిర్మూలనలో మనదేశం సాధించిన ప్రగతిని ప్రతిబింబిస్తుందని యూఎన్ఓ తెలిపింది. అయితే భార‌త్ ఇప్పటికీ మధ్యమ మాన‌వాభివృద్ధి దేశాల జాబితాలోనే ఉండ‌టమనేది దారిద్య్ర నిర్మూలనను వేగవంతం చేయాల్సిన విషయాన్ని స్పష్టం చేసింది. అల్పాభివృద్ధి దేశాల జాబితా నుంచి మధ్యమ మాన‌వాభివృద్ధి దేశాల జాబితాలోకి రావ‌డానికి భార‌త్‌కు దాదాపు 25 ఏళ్ల స‌మ‌యం ప‌ట్టగా అత్యధిక మానవాభివృద్ది దేశాల జాబితాలోకి రావ‌డానికి మ‌రో 20 ఏళ్లు ప‌డుతుంద‌నేది అక్షర స‌త్యం.

భారత నోబెల్ గ్రహీత అమర్త్య సేన్, పాకిస్తాన్ అర్థశాస్త్రజ్ఞుడు మహబూబ్- ఉల్ హక్ ప్రతిపాదించిన సూచీ ఆధారంగా మొద‌టిసారి 1990లో మాన‌వాభివృద్ధి సూచీని త‌యారు చేశారు. మొత్తం 193 ఐక్యరాజ్యసమితి సభ్యదేశాల్లో 189 దేశాల్లో త‌ల‌సరి ఆదాయం, విద్యా, ఆరోగ్యం (లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ) అనే మూడు ప్రాథమిక జీవన అవసరాలను ప్రామాణికంగా తీసుకొని అత్యధిక మానవాభివృద్ది దేశాలు, అధిక మానవాభివృద్ది దేశాలు, మధ్యమ‌ మానవాభివృద్ధి దేశాలు, అల్పమానవాభివృద్ధి దేశాలు అనే నాలుగు కేటగిరీలతో యూఎన్డీపీ ఏటా ర్యాంకులు విడుదల చేస్తుంది.

గత ఐదేళ్లలో భారత్‌ హెచ్‌డీఐ ర్యాంక్‌
సంవత్సరం ర్యాంక్‌ హెచ్‌డీఐ విలువ

2020 131 0.645
2019 129 0.647
2018 130 0.647
2017 130 0.640
2016 131 0.636
2015 130 0.627

హెచ్డీఐలో చివరి 10 దేశాలు
189 నైగర్‌ 0.394 62.4
188 సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌ 0.397 53.3
187 చాద్‌ 0.398 54.2
186 సౌత్​ సూడాన్‌ 0.433 57.9
185 బురుండి 0.433 61.6.
184 మాలి 0.434 59.3
182 సియోర్రా లియోన్‌ 0.452 54.7
182 బుర్కినా ఫాసో 0.452 61.6
181 మెజాంబిక్‌ 0.456 60.9
180 ఎరిట్రియా 0.459 66.3

సార్క్‌ దేశాల ర్యాంకులు
దేశం ర్యాంకు
శ్రీలంక 72
మాల్దీవులు 95
భారత్‌ 131
భూటాన్‌ 129
బంగ్లాదేశ్‌ 133
పాకిస్థాన్‌ 154
నేపాల్‌ 142
ఆఫ్ఘనిస్థాన్‌ 169

Latest Posts

MODEL PAPERS

PRACTICE PAPERS

STUDY MATERIAL