Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSటెన్త్ అర్హతతో పోస్టాఫీస్ జాబ్స్.. రూ.63 వేల వేతనంతో.. వివరాలివే

టెన్త్ అర్హతతో పోస్టాఫీస్ జాబ్స్.. రూ.63 వేల వేతనంతో.. వివరాలివే

నిరుద్యోగులకు పోస్టల్ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Postal Jobs Notification) విడుదల చేసింది. స్టాఫ్ డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 2 స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు ఖాళీగా  ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ మే 10వ తేదీన ముగియనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఖాళీల వివరాల్లోకి వెళ్తే.. హర్యాన సర్కిల్ లోని రోహ్తక్ జిల్లాలో 1, హిసార్ జిల్లాలో 1 ఖాళీ ఉంది.

Advertisement

విద్యార్హతల వివరాలు:
అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డ్ నుంచి టెన్త్ పాసై ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19,900-రూ.63,200 వరకు వేతనం ఉంటుందని తెలిపారు. అభ్యర్థుల వయస్సు 10 మే 2023 నాటికి గరిష్టంగా 56 ఏళ్లు మించకూడదని నోటిఫికేషన్లో పేరర్కొన్నారు. రిజర్వేషన్‌కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది.

అభ్యర్థుల ఎంపిక: స్కిల్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక ఉంటుంది. 

ఎలా దరఖాస్తు చేయాలి?: అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌ను అవసరమైన పత్రాలతో జత చేసి ఈ చిరునామాకు పంపాలి. అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టల్ సర్వీసెస్-I, O/o ది చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, హర్యానా సర్కిల్, ది మాల్, అంబాలా కంటోన్మెంట్ – 133001. 

Advertisement

అధికారిక వెబ్ సైట్: https://www.indiapost.gov.in/.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!