HomeJOBSనిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో 25 వేల పోస్టల్ జాబ్స్!

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో 25 వేల పోస్టల్ జాబ్స్!

భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖకు చెందిన తపాలా శాఖ.. గ్రామీణ డాక్ సేవక్, షెడ్యూల్-II నియామకాలకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే ఎంపిక చేస్తారు. దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో దాదాపు 25,000 కంటే ఎక్కువ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM),అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM),డాక్ సేవక్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

భారత తపాలా శాఖ గ్రామీణ ప్రాంతాల్లోని పోస్ట్ ఆఫీసుల్లో సేవలను విస్తరించేందుకు ఈ నియామకాలు చేపడుతోంది. ఇందులో ప్రధానంగా మూడు కేటగిరీల పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

(BPM): బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ నిర్వహణ, ఐపీపీబీ లావాదేవీలు, సేవలను అందించడం.

(ABPM): పోస్టల్ స్టాంపుల అమ్మకం, ఇంటింటికీ డెలివరీ చేయడం, BPMకి సహాయ పడటం.

Dak Sevak: సార్టింగ్ ఆఫీసులు , డెలివరీ సెంటర్లలో పోస్టల్ సేవల నిర్వహణ బాధ్యతలు.

అప్లికేషన్ విధానం:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఉండాల్సిన ముఖ్య అర్హతలు.

విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి (మాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులలో పాస్ మార్కులు) పూర్తి చేసి ఉండాలి. అలాగే సంబంధిత ప్రాంతీయ భాషను టెన్త్ వరకు చదివి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం, సైక్లింగ్ వచ్చి ఉండాలి.

వయోపరిమితి: కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి, గరిష్టంగా 40 ఏళ్ల లోపు ఉండాలి.. SC/ST అభ్యర్థులకు 5 ఏళ్లు, OBCకి 3 ఏళ్లు, PwBD అభ్యర్థులకు 10 నుంచి 15 ఏళ్ల వరకు సడలింపు వర్తిస్తుంది.

జీతం:
GDS అభ్యర్థులకు టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ రూపంలో జీతం చెల్లిస్తారు.

BPM: ప్రాథమిక TRCA స్లాబ్ రూ. 12,000 నుంచి రూ. 29,380 వరకు ఉంటుంది.

ABPM: ప్రాథమిక TRCA స్లాబ్ రూ. 10,000 నుంచి రూ. 24,470 వరకు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు:
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.100 మాత్రమే. మహిళలు, ఎస్సీ/ఎస్టీ, పీడబ్ల్యూబీడీ , ట్రాన్స్‌వుమన్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

ఎంపిక విధానం:
ఈ నియామకాలకు ఎలాంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించరు. టెన్త్ ఆధారంగా ఆటోమేటిక్ సిస్టమ్ జెనరేటెడ్ మెరిట్ లిస్ట్ తయారు చేసి ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు:

వన్-టైమ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 19 (సాయంత్రం 5 గంటల వరకు) అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్‌మిషన్: సెప్టెంబర్ 2 నుంచి 21 వ తేదీ (సాయంత్రం 5 గంటల వరకు) వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

అర్హత కలిగిన అభ్యర్థులు indiapost.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here