HomeJOBSకడపలోని మెంటల్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్‌లో.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

కడపలోని మెంటల్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్‌లో.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

కడపలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ (IMH Kadapa) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 53 పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్ విధానంలో ఈ నియామకాలు జరగనున్నాయి. పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. ఆఫ్‌ లైన్ విధానంలో అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జనవరి 5 నుంచి 12వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన వివరాలు:

సంస్థ పేరు: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, కడప (IMH Kadapa)

మొత్తం ఖాళీలు: 53 (25 కాంట్రాక్ట్ + 28 అవుట్‌సోర్సింగ్)

అప్లికేషన్లు ప్రారంభం: అభ్యర్థులు జనవరి 05వ తేదీ నుంచి అప్లై చేసుకోవచ్చు.

చివరి తేదీ: జనవరి 12 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది

అధికారిక వెబ్‌సైట్: kadapa.ap.gov.in

అర్హతలు:

విద్యార్హత: పోస్టును బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు టెన్త్, ఇంటర్, ఐటీఐ,డిప్లొమా,డిగ్రీ, పీజీ లేదా ఎం.ఫిల్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు (జనవరి 03, 2026 నాటికి): అభ్యర్థుల వయస్సు 42 ఏళ్ల లోపు ఉండాలి, SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయోసడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

మొత్తం 100 మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

విద్యార్హత మార్కులు (75%): క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ లో సాధించిన మార్కులు.

సీనియారిటీ వెయిటేజీ (10 మార్కులు): కోర్సు పూర్తి చేసిన తర్వాత ప్రతి ఏడాదికి ఒక మార్కు.

సర్వీస్ వెయిటేజీ (15%): గతంలో కాంట్రాక్ట్/అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేసిన వారికి (ముఖ్యంగా కోవిడ్ సమయంలో పనిచేసిన వారికి ప్రాధాన్యత).

అప్లికేషన్ ఫీజు : ఓసీ అభ్యర్థులకు రూ. 300, ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్/దివ్యాంగులకు రూ. 250 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

చెల్లింపు విధానం:‘Principal, Govt. Medical College, Kadapa’ పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ (DD) తీయాలి.

అప్లై చేయడం ఎలా ?

అభ్యర్థులు ముందుగా kadapa.ap.gov.in వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

ఫారమ్‌ను పూర్తి చేసి, అవసరమైన అన్ని సర్టిఫికెట్లను యాడ్ చేయండి.

పూర్తి చేసిన అప్లికేషన్ ను కడపలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ (GMC), పుట్లంపల్లి లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో జనవరి 12 లోపు అందజేయాలి.

పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ kadapa.ap.gov.in సంప్రదించవచ్చు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here