విశాఖపట్నంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆప్ మేనేజ్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. 55శాతం మార్కులతో ఏదేనీ డిగ్రీ పూర్తిచేసి క్యాట్/జీమ్యాట్ జీఆర్ఈ వ్యాలీడ్ స్కోర్ కలిగిన వారు ఈ ఐఐఎంవీ టెస్ట్ రాయడానికి అర్హులు. రెండేళ్ల వ్యవధిగల ఈ ప్రోగ్రామ్ పూర్తి చేసిన వారికి ఎంబీఏ డిగ్రీ ప్రదానం చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరితేదీ 2022 మే 02. ఎంట్రెన్స్ మే 15న ఉంటుంది.
వెబ్సైట్ : www.iimv.ac.in
పండిట్ దీన్‌దయాళ్ ఎనర్జీ వర్సిటీలో ఎంబీఏ
గాంధీనగర్‌లోని పండిట్ దీన్‌దయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ ఎంబీఏ ప్రోగామ్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ద్వితీయ శ్రేణి మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు అప్లై చేసుకోవచ్చు. నేషనల్ ఎంట్రెన్స్ స్కోర్, గ్రూప్ డిస్కర్షన్, ఎబిలిటీ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. అకాడమిక్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులకు మెరిట్ కం మీన్స్ స్కాలర్షిప్ సౌకర్యమూ ఉంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ 2022 ఫిబ్రవరి 06. గ్రూప్ డిస్కర్షన్, ఇంటర్వ్యూలు మార్చి 10 నుంచి 13 వరకు ఉంటాయి. ఎంపికైన అభ్యర్థుల జాబితాను మార్చి 28న విడుదల చేస్తారు.
వెబ్సైట్ : www.spm.pdpu.ac.in
మహింద్రా యూనివర్సిటీలో పీహెచ్డీ అడ్మిషన్స్
హైదరాబాద్‌లో మహింద్రా యూనివర్సిటీ స్ప్రింగ్ సెమిస్టర్‌కు గాను పీహెచ్‌డీలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఫిజిక్స్ సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ర్టికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, మేథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎంట్రపెన్యూర్షిప్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైస్సెన్ విభాగాల్లో అడ్మిషన్ల కోసం కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్/టెక్నాలజీ/సైన్స్/హ్యుమానిటీస్/సోషల్ సైన్సెన్ విభాగాల్లో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. ఎంటెక్ లేని ఫుల్‌టైం స్టూడెంట్స్ బీటెక్‌లో ఉత్తీర్ణులై గేట్ వ్యాలీడ్ స్కోర్ కలిగి ఉండాలి. ఆన్లైన్ ఇంటర్వ్యూలు నిర్వహించి విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ డిసెంబర్ 24. ఇంటర్వ్యూలు జనవరి 5 నుంచి 7వరకు ఉంటాయి.
వెబ్సైట్ : www.mahindraecoleccentrale.edu.in
సీఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో కాంట్రాక్ట్ జాబ్స్
బెంగళూర్‌లోని సీఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో కాంట్రాక్ట్ బేసిస్‌లో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ, బీటెక్, ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. బెంగళూర్ కోడిహల్లీ బ్రాంచీలో డిసెంబర్ 20, 22, 24 తేదీల్లో ఇంటర్వ్యూలు ఉంటాయి.
వెబ్సైట్ : www.nal.res.in
సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లో జూనియర్ టెక్నీషియన్, ఫైర్‌మెన్ పోస్టులు
హైదరాబాద్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లో జూనియర్ టెక్నీషియన్, ఫైర్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి, ఫైర్‌మెన్ ట్రైనింగ్, ప్రింటింగ్ ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పోస్టులకు అర్హులు. వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ చివరితేదీ జనవరి 15.
వెబ్సైట్ : www.spphyderabad.spmcil.com