హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక సంస్థ సీఎస్ఐఆర్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. వివిధ ప్రాజెక్ట్‌లలో ఖాళీగా ఉన్న 91 ఉద్యోగాల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. దీని ద్వారా ప్రాజెక్ట్ అసోసియేట్, సైంటిస్ట్, టెక్నికల్ సపోర్ట్ వంటి పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలాంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ లేకుండా అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి విద్యార్హత నిర్ణయించారు. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్థులు నేరుగా వాక్-ఇన్ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని సంస్థ ప్రకటించింది.
పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా పలు రకాల కీలక పోస్టులను భర్తీ చేస్తున్నారు. అవేంటంటే..
ప్రాజెక్ట్ అసోసియేట్-I & II
సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్
ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-I
ప్రాజెక్ట్ సైంటిస్ట్-I
ప్రాజెక్ట్ అసిస్టెంట్-II
ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III
విద్యార్హతలు:
పోస్టును బట్టి అభ్యర్థులు బీఈ/బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఫార్మసీ, ఎంటెక్ లేదా పీహెచ్‌డీ పూర్తి చేసి ఉండాలి. కొన్ని పోస్టులకు నెట్ (NET) లేదా గేట్ (GATE) అర్హతతో పాటు తగిన అనుభవం కూడా అవసరం. ఇక జీతం విషయానికి వస్తే, పోస్టుల స్థాయిని బట్టి నెలకు కనీసం రూ.20,000 నుంచి గరిష్టంగా రూ.57,000 వరకు జీతం లభిస్తుంది.
వయోపరిమితి:
ఇంటర్వ్యూ తేదీ నాటికి అభ్యర్థుల వయసు పోస్టును బట్టి 35 నుంచి 50 సంవత్సరాల వరకు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఇంటర్వ్యూ తేదీలు, వేదిక:
ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూలను ఆగస్టు 18 నుంచి 21 వరకు వరుసగా నిర్వహిస్తారు.
రిజిస్ట్రేషన్ సమయం: ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు మాత్రమే ఉంటుంది.
వేదిక: సీఎస్ఐఆర్-ఐఐసీటీ (CSIR-IICT), తార్నాక, హైదరాబాద్.
అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో నిర్ణీత సమయానికి ఇంటర్వ్యూ వేదిక వద్దకు చేరుకోవాలి.
(గమనిక: ఇంటర్వ్యూకు వెళ్లే ముందు అధికారిక వెబ్‌సైట్‌లోని పూర్తి నోటిఫికేషన్‌ను పరిశీలించడం మంచిది.)





