ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) పీహెచ్డీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసేందుకు అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో పాటు మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎంట్రెన్స్‌లో అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ తయారు చేసి ఇంటర్వ్యూలు నిర్వహించి సీట్లను కేటాయించనున్నారు.
ఎగ్జామ్ ప్యాటర్న్
ఎంట్రెన్స్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఆబ్జెక్టీవ్ టైపులో ఉంటుంది. రీసెర్చ్ మెథడాలజీ నుంచి 50 ప్రశ్నలు, సంబంధిత స్పెషలైజేషన్ నుంచి 50 ప్రశ్నలు మొత్తం 100 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున మొత్తం 400 మార్కులుంటాయి. నెగెటీవ్ మార్కులు ఏమీ ఉండవు. ఎలిజిబిలిటీ సాధించాలంటే కనీసం 50 శాతం మార్కులు సాధించాలి.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ డిసెంబర్ 22. హైదరాబాద్, వైజాగ్‌లో పరీక్షా కేంద్రాలున్నాయి. జనవరి 16న ఎగ్జామ్ ఉంటుంది.
వెబ్సైట్ : www.ignou.nta.ac.in
విజ్ఞాన్ యూనివర్సిటీలో యూజీ, పీజీ
గుంటూర్లోని విజ్ఞాన్ యూనివర్సిటీ 2022–23 విద్యా సంవత్సరానికి యూజీ, పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అగ్రికల్చర్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్ , బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీఏ ఎల్ఎల్బీతో పాటు పీజీలో ఎంబడెడ్ సిస్టమ్స్, వీఎల్ఎస్ఐ, డిజైన్, సీఎస్ఈ, బయోటెక్నాలజీ, ఫార్మ్ మెషినరీ, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విజ్ఞాన్ స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరితేదీ ఏప్రిల్ 20.
వెబ్సైట్ : www.vignan.ac.in
టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో పీజీ డిప్లొమా
పీజీ డిప్లొమా ఇన్ హెల్త్ కేర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రోగామ్లో ప్రవేశానికి ముంబైలోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. న్యూఢిల్లీలోని నేషనల్ హెల్త్ సిస్టమ్ రిసోర్స్ సెంటర్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ కోర్సులో చేరడానికి ఆర్ట్స్, కామర్స్, సైన్స్ విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసినవారు, నర్సింగ్, ఫార్మసీ, హెల్త్ కోర్సులు చదివిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ ఫీజు రూ. లక్ష ఉంటుంది. దరఖాస్తులు చేసుకోవడానికి డిసెంబర్ 31 చివరితేదీ.
వెబ్సైట్ : www.tiss.edu.in
నిమ్స్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ బేసిక్ జాబ్స్
హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ బేసిస్‌లో స్టడీ కోఆర్డినేటర్, స్టడీ నర్స్ ప్లైబొటొమిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఎల్టీ డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్, బీడీఎస్ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పోస్టులకు అర్హులు. ఉద్యోగం పొందిన వారికి నెలకు రూ. 24 వేల నుంచి రూ.36 వేల వరకు జీతభత్యాలు చెల్లిస్తారు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆన్లైన్లో దరఖాస్తుల చేసుకోవాలి. వివరాలకు వెబ్సైట్ www.nims.edu.in