ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU).. 2025-26 విద్యా సంవత్సరానికి గాను వివిధ డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులలో అడ్మిషన్ల కోసం అప్లికేషన్ గడువు పెంచుతూ ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. మొదట నిర్దేశించిన గడువులోగా అప్లై చేసుకోలేని అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. తాజా గడుపు ప్రకారం అభ్యర్థులు ఆగస్టు 31 తేదీ వరకు ఆన్ లైన్ విధానంలో అవసరమైన కోర్సులో అడ్మిషన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
కోర్సుల వివరాలు:
IGNOU ఓపెన్ యూనివర్సిటీ అనేక రకాల కోర్సులను అందిస్తుంది. వీటిలో డిగ్రీ,పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. అభ్యర్థులు తమ ఆసక్తి, అర్హతను బట్టి వీటిలో ఏదైనా ఎంచుకోవచ్చు.
అర్హత: ప్రతి కోర్సుకు ప్రత్యేకమైన అర్హత ప్రమాణాలు ఉంటాయి. ఉదాహరణకు, డిగ్రీ కోర్సులకు 10+2 (ఇంటర్మీడియట్) విద్యార్హత అవసరం కాగా, పీజీ కోర్సులకు బ్యాచిలర్ డిగ్రీ అవసరం.
అప్లికేషన్ విధానం:
అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి.
- అభ్యర్థులు మొదట ignouadmission.samarth.edu.in అనే అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి.
- వెబ్‌సైట్‌లో కొత్తగా రిజిస్ట్రేషన్ (New Registration) చేసుకోవాలి. దీని కోసం అవసరమైన వ్యక్తిగత వివరాలు, ఇమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ మొదలైనవి ఎంటర్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ కావాలి.
- ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారంలో అడిగిన అన్ని వివరాలను జాగ్రత్తగా ఎంటర్ చేయాలి.
- అవసరమైన డాక్యుమెంట్లు (ఫోటోగ్రాఫ్, సంతకం, స్టడీ సర్టిఫికెట్స్, క్యాస్ట్ సర్టిఫికెట్ వంటివి) స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజును డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
- అన్ని వివరాలను చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేసి.. ప్రింటవుట్ తీసుకోవాలి.
అప్లికేషన్ ప్రక్రియలో ఏవైనా సందేహాలు ఉంటే, అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న సహాయ కేంద్రం (Help Desk)ను సంప్రదించవచ్చు.





