ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీ ఎంఆర్) 80 అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు వీటికి పోటీ పడవచ్చు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, స్కిల్ టెస్టులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారు ఐసీ ఎంఆర్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. మొదటి నెల నుంచే సుమారు రూ.యాభై వేల వేతనం ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 80
అన్ రిజర్వ్డ్ 33, ఓబీసీ 21, ఎస్సీ 12, ఎస్టీ 6, ఈడబ్ల్యుఎస్ 8.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. కంపూ టర్ పరిజ్ఞానం (ఎంఎస్ ఆఫీస్, పవర్ పాయింట్) ఉండాలి. వయసు: డిసెంబరు నాటికి 30 ఏళ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాం గులకు పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 9, 2020
ఆ న్లైన్ పరీక్ష: జనవరి 3న
హైదరాబాద్, విజయవాడ సహా దేశవ్యాప్తంగా 35 ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలున్నాయి.
దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యుఎస్లకు రూ. 1200. మిగి లిన అందరికీ రూ. 1500
వెబ్ సైట్: https://www.icmr.gov.in
డిగ్రీతోనే… ఐసీఎంఆర్‌లో 80 అసిస్టెంట్ పోస్టులు
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS