ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (RRB)లో భారీగా ఖాళీల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 13,217 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులలో ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్), వివిధ స్కేల్స్ ఆఫీసర్స్ (I, II, III) పోస్టులు ఉన్నాయి. పోస్టులను బట్టి విద్యార్హత నిర్ణయించారు. అభ్యర్థులు సెప్టెంబర్ 21వ తేదీలోపు ఉద్యోగాలను అప్లై చేసుకోవచ్చు. అర్హత , ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీల పూర్తి వివరాలు:
మొత్తం 13,217 ఖాళీలలో పోస్టుల వారీగా వివరాలు:
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): 7,972
ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్): 3,907
ఆఫీసర్ స్కేల్-II:
జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్: 854
స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (అగ్రికల్చర్, లా, సీఏ, ఐటీ, మార్కెటింగ్, ట్రెజరీ మేనేజర్): 285
ఆఫీసర్ స్కేల్-III (సీనియర్ మేనేజర్): 199
అర్హతలు:
వయస్సు: (01-09-2025 నాటికి)
- ఆఫీస్ అసిస్టెంట్:
విద్యార్హత:డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
వయస్సు: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 28 సంవత్సరాల లోపు ఉండాలి. - ఆఫీసర్ స్కేల్-I:
విద్యార్హత: డిగ్రీ, అగ్రికల్చర్ కోర్సులు చేసిన వారికి ఈ పోస్టుల్లో ప్రాధాన్యత ఉంటుంది.
వయస్సు: 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. - ఆఫీసర్ స్కేల్-II:
జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్: 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ, 2 సంవత్సరాల అనుభవం కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
స్పెషలిస్ట్ ఆఫీసర్స్: సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణతో పాటు, అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయస్సు: 21 నుంచి 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
4.ఆఫీసర్ స్కేల్-III:
విద్యార్హత: 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ , 5 సంవత్సరాల అనుభవం తప్పనిసరి.
వయస్సు: 21 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులు.
(ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది)
ఎంపిక విధానం:
ఎంపిక ప్రక్రియ పోస్టును బట్టి మారుతుంది.
ఆఫీస్ అసిస్టెంట్: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ ఉండదు.
ఆఫీసర్ స్కేల్-I: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలతో పాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.
ఆఫీసర్ స్కేల్-II, III: సింగిల్ ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్షా విధానం:
ప్రిలిమినరీ పరీక్ష (ఆఫీస్ అసిస్టెంట్ & ఆఫీసర్ స్కేల్-I):
రీజనింగ్: 40 ప్రశ్నలు (40 మార్కులు)
న్యూమరికల్ ఎబిలిటీ: 40 ప్రశ్నలు (40 మార్కులు)
మొత్తం: 80 ప్రశ్నలు, 80 మార్కులు. సమయం: 45 నిమిషాలు.
మెయిన్ పరీక్ష (అన్ని పోస్టులకు):
రీజనింగ్: 40 ప్రశ్నలు (50 మార్కులు)
కంప్యూటర్ నాలెడ్జ్: 40 ప్రశ్నలు (20 మార్కులు)
జనరల్ అవేర్‌నెస్: 40 ప్రశ్నలు (40 మార్కులు)
ఇంగ్లీష్ / హిందీ: 40 ప్రశ్నలు (40 మార్కులు)
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: 40 ప్రశ్నలు (50 మార్కులు)
మొత్తం: 200 ప్రశ్నలు, 200 మార్కులు. సమయం: 2 గంటలు.
ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు (నెగటివ్ మార్కింగ్).
అప్లికేషన్ ఫీజు:
ఆఫీసర్ (స్కేల్ I, II & III)పోస్టులకు అప్లై చేసుకుని ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులు రూ.175 చెల్లించాలి. ఇతరులు రూ. 850 చెల్లించాలి.
ఆఫీస్ అసిస్టెంట్: ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులు రూ.175 చెల్లించాలి. ఇతరులు రూ.850 చెల్లించాలి.
అప్లికేషన్ విధానం, ఫీజు:
మరిన్ని వివరాలకు అభ్యర్థులు IBPS అధికారిక వెబ్‌సైట్ www.ibps.in సంప్రదించాలి.





