బ్యాంకు ఉద్యోగాలకు ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఐబీపీఎస్ పీఓ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, వయస్సు పరిమితి, ఫీజు సహా పూర్తి వివరాలను కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. ప్రొబేషనరీ ఆఫీసర్ / మేనేజ్‌మెంట్ ట్రైనీ (పీఓ/ఎంటీ) రిక్రూట్‌మెంట్ కోసం ఇప్పటికే ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా ఐబీపీఎస్ పీఓ 2025కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జులై 1వ తేదీ నుంచి జులై 21వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లకు గడువు నిర్ణయించింది.
ఐబీపీఎస్ పీఓ అర్హతలు:
జులై 1, 2025 నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం 20 సంవత్సరాలు ఉండాలి, 30 సంవత్సరాలకు మించకూడదు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అదనంగా, ఐబీపీఎస్ పీఓ 2025 కి అప్లే చేస్తున్న అభ్యర్థులు.. సంబంధిత బ్యాంకుల్లో చేరే సమయానికి సరైన క్రెడిట్ హిస్టరీని కలిగి ఉన్నారని నిర్ధారించుకోవాలి. ఐబీపీఎస్ పీఓ 2025 దరఖాస్తు రుసుము ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ. 175 కాగా, ఇతరులకు రూ. 850.
పూర్తి వివరాలకు ఐబీపీఎస్ పీఓ 2025 నోటిఫికేషన్ని చూడాలి. ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా వివిధ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తారు
బ్యాంక్ పేరు | ఖాళీల సంఖ్య |
---|---|
బ్యాంక్ ఆఫ్ బరోడా | 1000 |
బ్యాంక్ ఆఫ్ ఇండియా | 700 |
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర | 1000 |
కెనరా బ్యాంక్ | 1000 |
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా | 500 |
ఇండియన్ బ్యాంక్ | ఇంకా వెల్లడించలేదు |
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ | 450 |
పంజాబ్ నేషనల్ బ్యాంక్ | 200 |
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ | 358 |
యూకో బ్యాంక్ | ఇంకా వెల్లడించలేదు |
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా | ఇంకా వెల్లడించలేదు |
ముఖ్యమైన తేదీలు
ఈవెంట్ | తేదీలు |
---|---|
దరఖాస్తు ఫీజు చల్లింపు | జులై 1 నుంచి 21 వరకు |
ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ | ఆగస్టు 2025 |
ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ | ఆగస్టు 2025 |
ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ పరీక్ష | ఆగస్టు 2025 |
ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ ఫలితం | సెప్టెంబర్ 2025 |
మెయిన్స్ పరీక్ష అడ్మిట్ కార్డ్ | సెప్టెంబర్/అక్టోబర్ 2025 |
మెయిన్స్ పరీక్ష | అక్టోబర్ 2025 |
మెయిన్స్ ఫలితం | నవంబర్ 2025 |
పర్సనాలిటీ టెస్ట్ | నవంబర్/డిసెంబర్ 2025 |
ఇంటర్వ్యూ | డిసెంబర్ 2025 / జనవరి 2026 |
తాత్కాలిక కేటాయింపు (ప్రొవిజినల్ అలాట్‌మెంట్) | జనవరి/ఫిబ్రవరి 2026 |
Important Events | Dates |
---|---|
Commencement of online registration of application | 01/07/2025 |
Closure of registration of application | 21/07/2025 |
Closure for editing application details | 21/07/2025 |
Last date for printing your application | 05/08/2025 |
Online Fee Payment | 01/07/2025 to 21/07/2025 |