HomeJOBSడిగ్రీ అర్హతతో 6,715 ఉద్యోగాలు..వెంటనే అప్లై చేయండి

డిగ్రీ అర్హతతో 6,715 ఉద్యోగాలు..వెంటనే అప్లై చేయండి

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు గుడ్ న్యూస్. దేశ వ్యాప్తంగా ఉన్న 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 6,715 ప్రొబేషనరీ ఆఫీసర్స్/మేనేజ్‌మెంట్ ట్రైనీస్ (PO/MT) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు జీతం రూ.48,480 వరకు ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు జులై 21వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బ్యాంకుల వారీగా ఖాళీలు:
మొత్తం 6,715 పోస్టులలో కెనరా బ్యాంక్ అత్యధికంగా 1,500 పోస్టులను, బ్యాంక్ ఆఫ్ బరోడా 1,900 పోస్టులను భర్తీ చేస్తున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 504 పోస్టులు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రముఖ బ్యాంకులు కూడా వందల సంఖ్యలో ఖాళీలను ప్రకటించాయి.

అర్హతలు:
విద్యార్హత
: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జులై 21 నాటికి మీ దగ్గర వాలిడ్ మార్క్స్ మెమో ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి (01.07.2026 నాటికి). ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయోసడలింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇప్పటికే ప్రారంభమైంది.

ప్రిలిమ్స్ ఎగ్జామ్: ఆగస్టులో ప్రిలిమ్స్ పరీక్ష ఉండే అవకాశం ఉంది.

మెయిన్స్ ఎగ్జామ్: అక్టోబర్‌లో మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.

ఇంటర్వ్యూలు: నవంబర్ లేదా డిసెంబర్ లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

ఫైనల్ అలాట్‌మెంట్: జనవరిలో ఫైనల్ అలాట్మెంట్ ప్రకటిస్తారు.

ఎంపిక ప్రక్రియ, జీతం:
అభ్యర్థులను నాలుగు దశల్లో ఎంపిక చేస్తారు. మొదట 100 మార్కులకు ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వారికి 225 మార్కులకు మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత పర్సనాలిటీ టెస్ట్ , చివరగా 100 మార్కులకు కామన్ ఇంటర్వ్యూ ఉంటుంది. మెయిన్స్, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ తీస్తారు. ఇక జీతం విషయానికి వస్తే..ఎంపికైన పీఓ (PO) అభ్యర్థులకు ప్రారంభ బేసిక్ పే రూ. 48,480 ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.175 ఉంటుంది. ఓబీసీ/ఈడబ్ల్యూఎస్/జనరల్ అభ్యర్థులు రూ.850 చెల్లించాలి.

ఎలా అప్లై చేయాలి?
అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.ibps.in సందర్శించి హోంపేజీలో ఉన్న “CRP PO/MT” లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here