ఐబీపీఎస్ పీఓ పరీక్ష 2021 ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. 4135 పీఓ ఖాళీలకు 2021 డిసెంబరు 4 నుంచి 11 వరకు ఈ పరీక్ష నిర్వహించారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబరు, పాస్‌వర్డ్ ఉపయోగించి 2022 జనవరి 11 లోపు ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: www.ibpsonline.ibps.in
స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పెంపు
పోస్టు గ్రాడ్యుయేషన్(పీజీ) స్కాలర్ షిప్ దరఖాస్తు గడువును ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్(ఏఐసీటీఈ) జనవరి 31 వరకు పొడిగించింది. అభ్యర్థులు 31లోపు దరఖాస్తు చేసుకోవాలి. విద్యా సంస్థలు పరిశీలించి, ఫిబ్రవరి 15లోపు ఏఐసీటీఈ వెబ్‌పోర్టల్‌లో రీసబ్మిట్ చేయాలి. ఏఐసీటీఈ అనుమతి పొందిన కళాశాలలు, కోర్సులు చదివే వారు మాత్రమే ఈ ఉపకార వేతనాలకు అర్హులు.