ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్
పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) ప్రొబేషనరీ అఫీసర్/ మేనేజిమెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసారి 1167 పోస్టులను భర్తీ చేయనుంది.
అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
ఆగస్ట్ 5 వ తేదీ నుంచి ఆగస్ట్ 26 వరకు అప్లికేషన్ దాఖలు చేయవచ్చు.
ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 3,10,11 తేదీల్లో జరుగుతుంది. ఫలితాలు అక్టోబర్/నవంబర్ లో విడుదల అవుతాయి.
మెయిన్ పరీక్ష నవంబర్ 28 వ తేదీన జరుగుతుంది. ఫలితాలు డిసెంబర్ లో వస్తాయి.
షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకి జనవరి, ఫిబ్రవరి 2021 లో ఇంటర్వ్యూ లు నిర్వహించి ఎంపిక జాబితా ఏప్రిల్ లో ప్రకటిస్తుంది.
కరోనా కారణంగా పరీక్షల సమయం లో భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్లు, మాస్కులు తప్పనిసరి అని ఐబీపీఎస్ ప్రకటించింది.
హైదరాబాద్, కరీంనగర్, విజయవాడ, విశాఖపట్టణం వంటి ప్రధాన నగరాలు, పట్టణాల్లో ప్రిలిమనరీ, మెయిన్ పరీక్ష కేంద్రాలున్నాయి.
పూర్తి వివరాలు వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.
https://www.ibps.in/