నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. గ్రూప్ ఏ ఆఫీసర్, గ్రూప్ బి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 9,995 పోస్టులను భర్తీ చేయనుంది. దీనిలో ఎంపికైన వారు రీజినల్ రూరల్ బ్యాంక్ లో పనిచేయాల్సి ఉంటుంది.
ఐబీపీఎస్ జూన్ 6వ తేదీన ఆర్ఆర్ బీ కామన్ రిక్రూట్ మెంట్ ప్రాసెస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్ (స్కేల్ 1,2,3) ఆఫీస్ అసిస్టెంట్ ( మల్టీపర్పస్) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఈ పోస్టులు ఉన్నాయి.
పోస్టుల వివరాలు :
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) : 5,585 పోస్టులు
ఆఫీసర్ స్కేల్-I : 3499 పోస్టులు
ఆఫీసర్ స్కేల్-II (అగ్రికల్చర్ ఆఫీసర్) : 70 పోస్టులు
ఆఫీసర్ స్కేల్-II (లా) : 30 పోస్టులు
ఆఫీసర్ స్కేల్-II (సీఏ) : 60 పోస్టులు
ఆఫీసర్ స్కేల్-II (ఐటీ) : 94 పోస్టులు
ఆఫీసర్ స్కేల్-II (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్) : 496 పోస్టులు
ఆఫీసర్ స్కేల్-II (మార్కెటింగ్ ఆఫీసర్) : 11 పోస్టులు
ఆఫీసర్ స్కేల్-II (ట్రెజరీ మేనేజర్) : 21 పోస్టులు
ఆఫీసర్ స్కేల్-III : 129 పోస్టులు
మొత్తం ఉద్యోగాల సంఖ్య : 9,995.
అర్హతలు: పోస్టులను బట్టి అభ్యర్థులు బ్యాచిలర్స్, ఎంబీఏ, సీఏ పాసై ఉండాలి.
వయస్సు:
ఆఫీసర్ స్కేల్-1 (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు 18 ఏళ్లు నుంచి 30 ఏళ్లు
ఆఫీసర్ స్కేల్-2 (మేనేజర్) పోస్టులకు 21 నుంచి 32 ఏళ్లు.
ఆఫీసర్ స్కేల్-3 (సీనియర్ మేనేజర్) పోస్టులకు అభ్యర్థుల వయస్సు 21 నుంచి 40 ఏళ్లు
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు అభ్యర్థుల వయస్సు 18 నుంచి 28ఏళ్లు
ఫీజు:
జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.850,దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు రూ.175చెల్లించాలి.
https://www.ibps.in/ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
ఐబీపీఎస్ దరఖాస్తు ప్రారంభం : 2024 జూన్ 7
దరఖాస్తుకు చివరి తేదీ : 2024 జూన్ 27
ప్రిలిమినరీ పరీక్ష : 2024 ఆగస్టు 3, 4, 10, 17, 18
ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి : 2024 ఆగస్టు/ సెప్టెంబర్
మెయిన్స్ పరీక్ష తేదీ : 2024 సెప్టెంబర్/ అక్టోబర్
మెయిన్స్ ఫలితాల వెల్లడి (ఆఫీసర్ స్కేల్ 1, 2, 3) : 2024 అక్టోబర్
ఇంటర్వ్యూ తేదీలు (ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3) : 2024 నవంబర్
ప్రొవిజనల్ అలాట్‌మెంట్ (ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3 & ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)) : 2025 జనవరి