ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఆధ్వర్యంలో 2027-28 ఆర్థిక సంవత్సరానికి గాను క్లర్క్ (CSA) పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ గడువు రేపటితో (ఆగస్టు 21న) ముగియనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 11,403 కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (క్లర్క్) పోస్టులను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్మెంట్ జరుగుతోంది.
దీనికి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.
విద్యార్హత, వయస్సు వివరాలు:
ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే అభ్యర్థుల వయస్సు 01.08.2026 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో (ఏపీ & తెలంగాణ) ఖాళీల వివరాలు:
ఆంధ్రప్రదేశ్ : ఏపీలో మొత్తం 186 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
తెలంగాణ: రాష్ట్రంలో మొత్తం 191 క్లర్క్ పోస్టులను కేటాయించారు.
స్థానికత ఆధారంగా ఆయా రాష్ట్రాల అభ్యర్థులు స్థానిక భాషపై పట్టు కలిగి ఉండటం తప్పనిసరి.
ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ రెండు ప్రధాన దశలుగా ఉంటుంది.
ప్రిలిమినరీ పరీక్ష : ఇది ఆన్లైన్ రాత పరీక్ష, ఇందులో ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ , రీజనింగ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రిలిమ్స్ పరీక్ష అక్టోబర్ లో జరగనుంది.
మెయిన్స్ పరీక్ష : ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారికి డిసెంబర్లో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. దీని తర్వాత స్థానిక భాషా నైపుణ్య పరీక్ష ఉంటుంది.
ఫీజు వివరాలు:
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మాజీ సైనికోద్యోగులకు ఫీజు.. రూ.175 మాత్రమే. మిగిలిన అన్ని వర్గాల అభ్యర్థులకు రూ.850 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. దీనిని ఆన్లైన్ ద్వారా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ ఉపయోగించి చెల్లించవచ్చు.
మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ ibps.in సంప్రదించవచ్చు.





