బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న క్లర్క్ (కస్టమర్ సర్వీస్ అసోసియేట్) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS)నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10,277 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఆన్‌లైన్ ప్రక్రియ ఈ రోజు (ఆగస్ట్ 01) నుంచే ప్రారంభమైంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 01.
చివరి తేదీ: ఆగస్టు 21.
అర్హతలు:
ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ (ఏదైనా డిగ్రీ) ఉత్తీర్ణులై ఉండాలి.
అభ్యర్థులు అప్లై చేసుకునే రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం యొక్క అధికార భాషను చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి.
వయస్సు:
ఆగస్టు 1, 2025 నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం 20 సంవత్సరాలు, గరిష్టంగా 28 సంవత్సరాలు మించకూడదు. అయితే.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఫీజు:
అప్లికేషన్ ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 850 కాగా, ఎస్సీ/ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ. 175 గా నిర్ణయించారు.
ఎంపిక ప్రక్రియ:
అభ్యర్థుల ఎంపిక ప్రిలిమినరీ, మెయిన్స్ ఆన్‌లైన్ పరీక్షల ద్వారా జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే మెయిన్స్ పరీక్షకు అనుమతిస్తారు. ఈ రెండు పరీక్షలలో సాధించిన మార్కులను బట్టి ఫైనల్ లిస్ట్ తయారు చేస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. మెయిన్స్ పరీక్షలో జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
అప్లికేషన్ విధానం:
ఆసక్తి, అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు IBPS అధికారిక వెబ్‌సైట్ www.ibps.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.





