ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ (కస్టమర్ సర్వీస్ అసోసియేట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 10,277 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆపరేటింగ్, అప్లికేషన్స్‌పై అవగాహన ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులు. 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో ఈ పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
కస్టమర్ సర్వీస్ అసోసియేటర్ పోస్టులు – 10,277
రాష్ట్రాల వారిగా పోస్టులు:
ఏపీ- 367
తెలంగాణ- 261
అర్హతలు:
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
కంప్యూటర్ పరిజ్ఞానం: అభ్యర్థులు కంప్యూటర్ ఆపరేటింగ్, అప్లికేషన్స్‌పై అవగాహన కలిగి ఉండాలి. అభ్యర్థులు డిప్లొమా, డిగ్రీ లేదా సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. పాఠశాల లేదా కాలేజీ స్థాయిలో కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివిన వారికి కూడా ఈ పోస్టులకు అర్హులు.
స్థానిక భాషా పరిజ్ఞానం: అభ్యర్థులు ఏ రాష్ట్రంలో అప్లై చేసుకుంటున్నారో.. ఆ రాష్ట్రం యొక్క స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడటం తెలిసి ఉండాలి. 10వ తరగతి లేదా ఆ పై స్థాయిలో స్థానిక భాషను ఒక సబ్జెక్టుగా చదివిన వారికి భాషా నైపుణ్య పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. మిగతా అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష తర్వాత భాషా పరిజ్ఞాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.
ముఖ్యమైన తేదీలు:
అప్లై చేసుకోవడానికి చివరి తేదీ: ఆగస్టు 21 వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్: సెప్టెంబర్‌లో అభ్యర్థులకు ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ అందిస్తారు.
ప్రిలిమినరీ పరీక్ష: అక్టోబర్ 4, 5, 11 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షను నిర్వహిస్తారు.
మెయిన్స్ పరీక్ష: నవంబర్ 29వ తేదీన ఈ పోస్టులకు సంబంధించి మెయిన్స్ నిర్వహించారు.
వయస్సు: ఆగస్టు 1, 2025 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, వికలాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.850, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యుడీ అభ్యర్థులకు రూ.175 ఉంటుంది.
ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక 2 దశల్లో నిర్వహించే ఆన్‌లైన్ పరీక్షల ద్వారా జరుగుతుంది.
ప్రిలిమినరీ పరీక్ష: ఇది ఒక అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు.
మెయిన్స్ పరీక్ష: మెయిన్స్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది.
అప్లై చేసుకునే విధానం:
అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు IBPS అధికారిక వెబ్‌సైట్ ibps.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే ముందు అభ్యర్థులు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, అవసరమైన అన్ని వివరాలు, ఫొటోగ్రాఫ్, సంతకం, చేతిరాత డిక్లరేషన్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.





