HomeLATEST6,128 క్లర్క్​ పోస్టులకు ఐబీపీఎస్​ నోటిఫికేషన్

6,128 క్లర్క్​ పోస్టులకు ఐబీపీఎస్​ నోటిఫికేషన్

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (CRP) ద్వారా 6,128 క్లర్క్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బ్యాంక్‌లో ఎంట్రీలెవెల్‌ జాబ్‌ కావడం, డిగ్రీతోనే ఐదంకెల జీతం, వంటి సానుకూలతల వల్ల గత పదేళ్లుగా ఈ ఉగ్యోగాలకు తీవ్ర పోటీ నెలకొంది. ఈసారి అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 15 నుంచి 20 లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా. రెండు దశల్లో జరిగే ఈ పరీక్షలో గట్టెక్కాలంటే నిరంతరం ప్రణాళికాబద్ధంగా చదవాలి. చాలా తక్కువ సమయంలో వేగంగా సమాధానాలు గుర్తించగలగాలి. ఈ నేపథ్యంలో ఎగ్జామ్​ సిలబస్​, ప్రిపరేషన్ ప్లాన్​, పరీక్ష విధానం, క్లర్క్‌ కెరీర్‌ ఎలా ఉంటుందో తెలుసుకుందాం..

నోటిఫికేషన్​లో ప్రకటించిన ఖాళీల్లో ఆంధ్రప్రదేశ్‌లో 105, తెలంగాణలో 104, పుదుచ్చేరి (ఈ రాష్ట్రంలో తెలుగులో పరీక్ష రాసే అవకాశం ఉంది)లో 8 ఉన్నాయి. ఇప్పటివరకూ 11 బ్యాంకుల్లో 6 మాత్రమే ఖాళీల వివరాలు ఐబీపీఎస్‌కు తెలియజేశాయి. ఇంకా 5 ఖాళీల వివరాలను తెలియజేయాల్సి ఉంది.

ఎగ్జామ్​ ప్యాటర్న్​: ఐబీపీఎస్‌ క్లర్క్‌ పరీక్ష ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ అనే రెండు దశల్లో జరుగుతుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారు మాత్రమే మెయిన్స్‌ కు వెళ్తారు. ఇంటర్వ్యూ ఉండదు. రెండు దశల్లోను నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం అమల్లో ఉంది కాబట్టి ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. జనరల్‌ ఇంగ్లీష్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌ ఎబిలిటీ, జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌, కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌, క్వాంటిటేటివ్‌ యాప్టిట్యూడ్‌ అనే సెక్షన్ల నుంచి ప్రశ్నలు వస్తాయి.

ఇంగ్లీష్‌ 30 ప్రశ్నలు 30 మార్కులు
న్యూమరికల్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు 35 మార్కులు
రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు 35 మార్కులు

జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నలు 50 మార్కులు
జనరల్‌ ఇంగ్లిష్‌ 40 ప్రశ్నలు 40 మార్కులు
రీజనింగ్‌ ఎబిలిటీ & కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు 60 మార్కులు
క్వాంటిటేటివ్‌ యాప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు 50 మార్కులు

ప్రిపరేషన్‌ ప్లాన్​: సిలబస్‌ను పూర్తిగా చదివి అవగాహన చేసుకోవడం చాలా ముఖ్యం. అంటే ఏ సబ్జెక్టులో ఏ చాప్టర్స్‌ ఉన్నాయి. వాటిల్‌ సబ్‌ చాప్టర్స్ ఏంటి? అందులో ప్రత్యేకమైన మెథడ్స్‌ ఉన్నాయా వంటి అంశాలను క్షుణ్నంగా చదవడం వల్ల ఫోకస్డ్‌గా ప్రిపేరవ్వవచ్చు. మ్యాథ్స్‌, రీజనింగ్‌ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడానికి ఎక్కువ సమయం కావాలి కాబట్టి ప్రాక్టీస్‌ చాలా ముఖ్యం. ఒక అంశాన్ని పదేపదే చదవడం, రాయడం, సాధన చేయడం వల్ల అందులో ఏ రకంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది? సులభ పద్దతి ఏది వంటివి అవగాహనకు వస్తాయి. ఒక పుస్తకాన్ని ఎక్కువ సార్లు చదవడం వల్ల నేర్చుకున్న విషయం ఎప్పటికీ మర్చిపోయే అవకాశం లేదు. రోజూ ఇంగ్లీష్‌ పేపర్​ చదవడం వలన సబ్జెక్టులో ఎక్కువ మార్కులు స్కోర్​ చేయవచ్చు. ఏ పరీక్షలోనైనా ప్రీవియస్‌ పేపర్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. కొత్తగా రూపొందించే ప్రశ్నాపత్రం కూడా 10 నుంచి 20 శాతం మినహాయించి దాదాపు ప్రీవియస్‌ పేపర్‌కు సమాన స్థాయి, సరళిని కలిగి ఉంటుంది. కాబట్టి మూడు లేదా నాలుగు సంవత్సరాల పేపర్లు సాధన చేయడం వల్ల ప్రిపరేషన్‌ సులువవుతుంది. బృందాలుగా ఏర్పడి చదవడం, ప్రాక్టీస్‌ చేయడం వల్ల నాలెడ్జ్‌ షేరింగ్ జరిగి నేర్చుకున్న విషయాలను సమస్యకు అన్వయించే నైపుణ్యం పెరుగుతుంది. నాలెడ్జ్‌ విస్తృతం అవుతుంది. ఏ ప్రిపరేషన్‌లో అయినా ప్రాక్టీస్‌ టెస్టులు కీలకపాత్ర పోషిస్తాయి. అప్పటిదాకా నేర్చుకున్న విషయాలను అప్లై చేయడం ద్వారా మీ పర్‌ఫార్మెన్స్‌ ను అంచనా వేసుకోవచ్చు. మిమ్మల్ని మీరు అంచనా వేసుకొని తప్పులు సరిదద్దుకోవడానికి ప్రాక్టీస్‌ను మించిన ఉత్తమ మార్గం లేదు. సబ్జెక్టు ఏదైనా ప్రాక్టీస్‌ చాలా ముఖ్యం. విషయం అర్థం కాకపోయినా పదేపదే చదవడం వల్ల కొంత సమయం గడిచే సరికి ఫెమిలియారిటీ పెరగడంతో దానిపై పూర్తి అవగాహన వస్తుంది. విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి అని కాకుండా విషయాన్ని తెలుసుకోవాలి అని చదివితే మంచి ఫలితం ఉంటుంది.

కెరీర్‌గ్రాఫ్‌: క్లర్క్‌ స్థాయిలో బ్యాంకులో ప్రవేశించినవారికి ప్రారంభంలోనే 30 వేల వరకు (పనిచేస్తున్న ప్రదేశంను బట్టి) వేతనం అందుతుంది. 5 నుంచి 8 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అభ్యర్థి సామర్థ్యాన్ని బట్టి బ్యాంక్‌ పీవోగా కూడా ప్రమోషన్‌ పొందవచ్చు. పీవో బ్యాంకులో అన్ని కార్యకలాపాలు నిర్వహిస్తారు కాబట్టి ఈ దశలో మంచి అనుభవం సంపాదించుకున్న వారు అతి త్వరలోనే అసిస్టెంట్​ మేనేజర్​, బ్రాంచ్​ మేనేజర్​, చీఫ్ మేనేజర్​, డిప్యూటీ మేనేజర్​, సర్కిల్​ మేనేజర్​, చివరకు జనరల్ మేనేజర్​ వరకు చేరుకోవచ్చు.బ్యాంకుల్లో తరచుగా ట్రాన్స్‌ఫర్స్‌ ఉంటాయి. ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని విషయాలు క్షుణ్నంగా తెలుసుకోవాలి.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ అండ్​ (న్యూమరికల్‌ ఎబిలిటీ): సింప్లిఫికేషన్స్, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్, నంబర్‌ సిరీస్, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ నుంచి ఎక్కువ ప్రశ్నలుంటాయి. (ఒక్కో దాని నుంచి కనీసం 5 ప్రశ్నలు). వీటితోపాటు అర్థమెటిక్‌లోని వివిధ టాపిక్స్‌ నుంచి -1 ప్రశ్న, మొత్తం మీద 10- నుంచి 12 ప్రశ్నలు వస్తాయి. వీటిలోని ముఖ్యమైన టాపిక్స్‌.. నంబర్‌ సిస్టమ్, రేషియోలు, పార్టనర్‌షిప్, ఏజెస్, యావరేజి, పర్సంటేజి, ప్రాఫిట్‌-లాస్, సింపుల్‌-కాంపౌండ్‌ ఇంటరెస్ట్, టైమ్‌-వర్క్, టైమ్‌-డిస్టెన్స్, మెన్సురేషన్, ఎలిగేషన్‌-మిక్చర్స్, పర్ముటేషన్‌-కాంబినేషన్, ప్రాబబిలిటీ.

రీజనింగ్‌: దీనిలో సీటింగ్‌ అరేంజ్‌మెంట్, పజిల్స్‌ నుంచి దాదాపు 20 ప్రశ్నలు వస్తాయి. ఇతర ముఖ్యమైన టాపిక్స్‌- కోడింగ్‌-డీకోడింగ్, బ్లడ్‌ రిలేషన్స్, డైరెక్షన్స్, ఆల్ఫాన్యూమరిక్‌ సిరీస్, ఇన్‌ఈక్వాలిటీస్, ఆర్డర్‌-ర్యాంకింగ్, సిలాజిజమ్, వెన్‌ డయాగ్రమ్‌తోపాటు స్టేట్‌మెంట్‌ ఆధార ప్రశ్నలు, ఇన్‌పుట్‌-అవుట్‌పుట్, డెసిషన్‌ మేకింగ్‌ మొదలైనవి.

ఇంగ్లీష్‌: దీనిలో రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ నుంచి 7- నుంచి 10 ప్రశ్నలుంటాయి. ఆపై గ్రామర్‌ ఆధార ప్రశ్నలు వస్తాయి. ఉదా: ఎర్రర్‌ ఫైండింగ్స్, సెంటెన్స్‌ అరేంజ్‌మెంట్, సెంటెన్స్‌ కరెక్షన్, ఫిల్లర్స్, డబుల్‌ ఫిల్లర్స్, క్లోజ్‌ టెస్ట్‌ మొదలైనవి. ఒకాబ్యులరీ నుంచి కూడా ప్రశ్నలుంటాయి.

జనరల్‌ అవేర్‌నెస్‌: దీంట్లో ఎకనామికల్‌/ ఫైనాన్షియల్‌/ బ్యాంకింగ్‌లకు సంబంధించిన తాజా పరిణామాలపై ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి. వీటితోపాటుగా జాతీయ/అంతర్జాతీయ సంస్థలు, ముఖ్యమైన దినోత్సవాలు, వ్యక్తులు, ప్రదేశాలు, పుస్తకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు మొదలైనవీ ముఖ్యమే.

కంప్యూటర్‌ అవేర్‌నెస్‌: దీనిలో ముఖ్యమైనవి కంప్యూటర్‌ బేసిక్స్, ఇన్‌పుట్, అవుట్‌పుట్‌ డివైజెస్, సీపీయూ, కీబోర్డ్‌ షార్ట్‌కట్, సాఫ్ట్‌వేర్, ఆపరేటింగ్‌ సిస్టమ్, ఎంఎస్‌-ఆఫీస్‌ (వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్‌), ఇంటర్నెట్‌/ఈ-మెయిల్, నెట్‌వర్కింగ్, సైబర్‌ సెక్యూరిటీ మొదలైనవి.

Advertisement

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

సెలెక్షన్​: ప్రిలిమినరీ, మెయిన్స్ రాత పరీక్షల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆన్​లైన్​ ఎగ్జామ్స్​ ఆగస్టు 24, 25, 31వ తేదీల్లో ఉంటుంది. మెయిన్స్​ అక్టోబర్​ 13న నిర్వహిస్తారు.

అప్లికేషన్స్​: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో జులై1 నుంచి జులై 21 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్​ ఫీజు ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.175. ఇతరులకు రూ.850 చెల్లించాలి. పూర్తి వివరాలకు www.ibps.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!