HomeLATEST1828 బ్యాంక్​ ఆఫీసర్​ జాబ్స్.. ప్రిపేరవుతున్నారా.. డోంట్​ మిస్​..! ​

1828 బ్యాంక్​ ఆఫీసర్​ జాబ్స్.. ప్రిపేరవుతున్నారా.. డోంట్​ మిస్​..! ​

ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ బ్యాంకింగ్​ పర్సనల్​ సెలక్షన్​(ఐబీపీఎస్)​1828 స్పెషలిస్ట్​ ఆఫీసర్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. బ్యాంక్​ క్లర్క్​, పీఓ జాబ్స్​కు ప్రిపేర్​ అవుతున్న అభ్యర్థులకు ఇదో మంచి అవకాశం. ​డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో స్కేల్​–1 ఆఫీసర్​ కేడర్​ పోస్టులకు ఏమేం చదవాలి.. ఎగ్జామ్​ ఎలా ఉండబోతుందో.. తెలుసుకుందాం..

Advertisement

సిలబస్ అండ్ టిప్స్‌

రీజనింగ్​ ఎబిలిటీ

ఈ విభాగంలో ప్రశ్నలు లాజికల్‌గా ఆలోచించి రాసేలా ఉంటాయి. క్వశ్చన్ ప్యాటర్న్‌ విశ్లేషిస్తే దాదాపు సమాధానం రాబట్టవచ్చు. నాలుగైదు సంవత్సరాలకు చెందిన అన్ని బ్యాంకు ప్రీవియస్‍ పేపర్లలో ఇచ్చిన ప్రశ్నలను, వాటి మెథడ్స్‌ ప్రాక్టీస్​ చేయాలి. సిట్టింగ్​ అరేంజ్​మెంట్​, పజిల్​ టెస్ట్​, స్టేట్​మెంట్స్​ అండ్​ కన్​క్లూజన్స్, కోడింగ్​–డీకోడింగ్​, డైరెక్షన్స్ అనే 5 టాపిక్‌ల నుంచే ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి ఆయా టాపిక్​ల్లో ఉన్న అన్ని మోడల్స్​, మెథడ్స్​ చదవాలి. వీటితో పాటు అనాలజీ, క్లాసిఫికేషన్స్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, నంబర్‍ టెస్ట్, ర్యాంకింగ్‍ టెస్ట్ వంటి వర్బల్‍ రీజనింగ్‍ టాపిక్స్ పై దృష్టి పెట్టాలి. కోర్సెస్‌ ఆఫ్‌ యాక్షన్, ఇన్‌పుట్, అవుట్‌పుట్, కాజ్‌ అండ్​ ఎఫెక్ట్, స్టేట్‌మెంట్‌-ఇన్‌ఫరెన్స్​, మిర్రర్‍ ఇమేజస్‍, వాటర్‍ ఇమేజస్‍, పేపర్‍ ఫోల్డింగ్‍, పేపర్‍ కట్టింగ్‍, ప్యాటర్న్ కంప్లీషన్‍, ఎంబెడ్డెడ్‍ ఫిగర్స్ వంటి నాన్‍వర్బల్‍ రీజనింగ్‍ అంశాలు ప్రాక్టీస్‍ చేయాలి.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్​

ప్రాక్టీస్ ఎక్కువ చేయాల్సిన సబ్జెక్ట్​ ప్రిపరేషన్​ సమయంలో ఫార్మూలాలు, షార్ట్‌కట్స్ రాసుకొని సాధన చేస్తే తక్కువ సమయంలో ఆన్సర్​ చేయచ్చు. ఈ విభాగంలో గత పరీక్షల్లో ఎక్కువగా నంబర్​ సిరీస్​, డేటా సఫీషియన్సీ, డేటా ఇంటర్​ప్రిటేషన్​, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్​, ఆరిథ్​మెటిక్​ టాపిక్​ల నుంచి ప్రశ్నలిచ్చారు. కాబట్టి వీటిపై ఫోకస్​ చేయడం ఎంతో అవసరం. అరిథ్‍మెటిక్‍ అంశాలైన పర్సెంటేజెస్, నిష్పత్తులు, లాభనష్టాలు, నంబర్ సిరీస్, బాడ్‌మాస్ రూల్స్ పై పట్టు సాధించాలి. వీటితోపాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా అనాలిసిస్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలి. నంబర్‍ సిరీస్‍, నంబర్‍ సిస్టం, సింప్లిఫికేషన్స్, ఎల్‍సీఎం, హెచ్‍సీఎం, రూట్స్ అండ్‍ క్యూబ్స్, డెసిమల్‍ ఫ్రాక్షన్స్, ప్లాబ్లమ్స్ ఆన్‍ ఏజెస్, పని–కాలం, పని–దూరం, ట్రైన్స్ లో అన్ని మోడల్స్‌ చదవాలి.

Advertisement

జనరల్​ అవేర్​నెస్​

ఈ విభాగంలో బ్యాంకింగ్​ రిలేటెడ్​ జనరల్​ అవేర్​నెస్​ టాపిక్​ల మీద దృష్టి పెట్టాలి. ఇండస్ర్టీలో వస్తున్న తాజా మార్పులు, ఫైనాన్షియల్​ మార్కెట్స్​, సర్టిఫికెట్ ఆఫ్​ డిపాజిట్స్, బ్యాంకస్యూరెన్స్, లెటర్​ ఆఫ్​ క్రెడిట్​, మనీ మార్కెట్స్​, మనీ ఫంక్షన్స్​ అండ్​ టైప్స్​, బ్యాంక్​ లోన్స్​ అండ్​ డిపాజిట్స్​, పథకాలు, టైప్స్​ ఆఫ్​ అకౌంట్స్, క్యాపిటల్​ అండ్​ మనీ మార్కెట్ ఇన్​స్ర్టూమెంట్స్, పి నోట్స్, ఇండియన్​ ఫైనాన్షియల్​ సిస్టమ్​, స్ర్టక్చర్​ ఆఫ్​ బ్యాంకింగ్​, రీటెయిల్​ బ్యాంకింగ్​, బ్యాంక్​ టెర్మ్స్​, బ్యాంకింగ్ అండ్​ నాన్​ బ్యాంకింగ్ సంస్థలు, ఆర్​బీఐ, నాబార్డ్​, బ్యాంకింగ్​ కమిటీలు, మ్యూచ్​వల్​ ఫండ్స్​, ఈ పేమెంట్​ సిస్టమ్స్​ వంటి టాపిక్​ల నుంచి ప్రశ్నలిస్తారు. ఇందుకు ఏదైనా స్టాండార్డ్​ పుస్తకం ప్రిపేరవ్వాలి. బిజినెస్ పుస్తకాలు, పీరియాడికల్స్‌, మేగజీన్స్ చదవడం వల్ల బ్యాంకింగ్​ నాలెడ్జ్‌ పెరుగుతుంది. ఇందులో కరెంట్‌ అఫైర్స్‌, జనరల్​ నాలెడ్జ్‌ నుంచి కూడా ప్రశ్నలొచ్చే అవకాశం ఉంది.

ఇంగ్లిష్​ లాంగ్వేజ్​

పెద్ద పెద్ద వ్యాసాలు వేగంగా చదివి అర్థం చేసుకోగలిగితే అత్యధిక మార్కులు పొందగలిగే సబ్జెక్ట్ ఇంగ్లిష్ అని చెప్పవచ్చు. ప్యాసేజ్ ఆధారంగా దాదాపు 10 ప్రశ్నలిస్తారు కాబట్టి అందులోని సారాంశంను తెలుసుకుంటే అన్ని మార్కులు మీవే. ప్యాసేజ్‌లోని కష్టమైన పదాలకు అర్థాలు తెలిస్తే సిననిమ్స్, ఆంటోనిమ్స్, ఇడియమ్స్‌ వంటి ప్రశ్నలకూ సమాధానాలు రాయవచ్చు. న్యూస్​పేపర్స్​, చానళ్లలో ఉపయోగిస్తున్న పదజాలం, వాక్య నిర్మాణం వంటి వాటిని పరిశీలించాలి.

అగ్రికల్చర్​ ఆఫీసర్​

స్పెషలిస్ట్ ఆఫీసర్లు అగ్రికల్చర్ లోన్లు, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి పథకాలు, ఇన్సూరెన్స్​ స్కీమ్స్​, క్రాప్​ సీజన్స్​, అగ్రికల్చర్​ స్కీమ్స్, మార్కెటింగ్ తదితర కార్యాకలాపాల్లో రైతులకు సహకరించాలి కాబట్టి బ్యాంకులో ఈ విధులకు సంబంధించిన ప్రశ్నలతో పాటు అకడమిక్ టాపిక్స్‌ అయిన సీడ్స్​, ఎనిమల్​ హజ్బెండరీ, క్రాప్​ అండ్​ సీడ్​ వెరైటీస్​, హెర్బిసైడ్స్​, పెస్టిసైడ్స్​, ప్లాంట్స్​, ఫ్రూట్స్​, వెజిటబుల్స్​లో ముఖ్యాంశాలు, డిఫరెంట్ డిసీజెస్​, క్రాప్ సిస్టమ్స్​, సీడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్​ ఎకనామిక్స్​, అగ్రికల్చర్​ ప్రాక్టీసెస్​, సాయిల్​ టైప్స్​, గ్రీన్​ మ్యాన్యూర్స్​, ఎనిమల్​ వెరైటీస్​ అండ్​ బ్రీడ్స్​, అగ్రికల్చర్​ ఇండస్ర్టీస్​, కాటేజస్​, ఎనిమల్​ డిసీజెస్​ అండ్​ ఇట్స్​ కాజెస్​ వంటి వాటినుంచి క్వశ్చన్స్ వస్తాయి. నిత్యం ఇండస్ర్టీ అప్‌డేట్స్ తెలుసుకుంటూ ప్రిపేరయితే మంచిది.

Advertisement


మొత్తం పోస్టులు:

ఐబీపీఎస్​ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 1828 ఖాళీలున్నాయి. ఇందులో స్పెషలిస్ట్ ఆఫీసర్‌- 220 పోస్టులు, ఐటీ ఆఫీసర్‌- 220, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్‌- 884 పోస్టులు, రాజభాష అధికారి- 84 పోస్టులు, లా ఆఫీసర్‌- 44 పోస్టులు, హెచ్‌ఆర్ లేదా పర్సనల్ ఆఫీసర్‌- 61 పోస్టులు, మార్కెటింగ్ ఆఫీసర్‌ 535 పోస్టులున్నాయి.

అర్హతలు:

ఐటీ ఆఫీసర్ పోస్టుకు సంబంధిత విభాగాల్లో నాలుగేళ్ల ఇంజినీరింగ్​ డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణత ఉండాలి. అగ్రికల్చర​ ఫీల్డ్​ ఆఫీసర్​​కి సంబంధిత విభాగాల్లో నాలుగేళ్ల డిగ్రీ ఉండాలి. రాజ్యభాష అధికారికి హిందీ, సంస్కృతం భాషల్లో పీజీతో పాటు ఇంగ్లిష్​/ హిందీ సబ్జెక్టులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లా ఆఫీసర్​ పోస్టుకు లా డిగ్రీతో పాటు బార్​ కౌన్సిల్​లో అడ్వకేట్​గా ఎన్​రోలై ఉండాలి. మార్కెటింగ్​ ఆఫీసర్​కి మార్కెటింగ్​ స్పెషలైజేషన్​లో రెండేళ్ల ఎంఎఎస్/ ఎంబీఏ/ పీజీ డిప్లొమా చేసి ఉండాలి.

సెలెక్షన్ ప్రాసెస్

ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ మూడు దశల్లో ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్‌ ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. నెగెటివ్ మార్కులున్నాయి. ప్రతి రాంగ్​ ఆన్సర్‌‌కు 1/4 మార్కు మైనస్ అవుతుంది. డ్యురేషన్120 నిమిషాలు. ప్రిలిమ్స్‌ క్వాలిఫైయింగ్ పరీక్ష మాత్రమే. ఈ మార్కులను మెరిట్‌లో కలపరు. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన వారిని ఖాళీలను బట్టి మెయిన్స్‌కు షార్ట్‌లిస్ట్ చేస్తారు. ప్రతి సెక్షన్‌తో పాటు ఓవరాల్ కటాఫ్ మార్కులు సాధించాలి. మెయిన్స్‌లో రాజ్యభాష అధికారి తప్ప మిగతా పోస్టులకు ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌ మాత్రమే ఉంటుంది. ఇందులో 60 మార్కులకు 60 ప్రశ్నలిస్తారు. సమయం 45 నిమిషాలు. రాజ్యభాష అధికారికి ప్రొఫెషనల్​ నాలెడ్జ్‌ 45 మార్కులకు, డిస్ర్కిప్టివ్ టెస్ట్ 15 మార్కులకు ఉంటుంది. సమయం ఒక గంట. మెయిన్స్‌లో నిర్దేశిత కటాఫ్ మార్కులు పొందిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. దీనికి 100 మార్కులు కేటాయించారు. మెయిన్స్​, ఇంటర్వ్యూల్లో ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్ట్​ తయారు చేస్తారు.

ఎగ్జామ్ ప్యాటర్న్‌

ప్రిలిమ్స్‌

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు
ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 25
రీజనింగ్ 50 50
ఐటీ, అగ్రికల్చర్, హెచ్‌ఆర్, మార్కెటింగ్​
క్వాంటిటేటివ్​ ఆప్టిట్యూడ్​ 50 50
లా ఆఫీసర్, రాజ్‌భాష అధికారి
జనరల్ అవేర్‌నెస్ 50 50
మొత్తం 150 125


నోటిఫికేషన్​

వయసు: 23 నవంబర్​ 2021 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
చివరితేది: 23 నవంబర్‌
అప్లికేషన్​ ఫీజు: జనరల్​ అభ్యర్థులకు రూ. 850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు రూ. 175.
ప్రిలిమ్స్​ ఎగ్జామ్​: 26 డిసెంబర్​ 2021.
మెయిన్స్: 30 జనవరి 2022.
ఇంట‌ర్వ్యూలు: ఫిబ్రవ‌రి/ మార్చి 2022లో ఉంటాయి.
ఉద్యోగాలు కల్పించే బ్యాంక్స్​: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.

వెబ్‌సైట్: www.ibps.in

Advertisement

మార్కెటింగ్ ఫీల్డ్​ ఆఫీసర్​

బ్యాంక్​ సర్వీస్​లను వినియోగదారులకు చేరవేసే మార్కెటింగ్​ విధానాలు, కస్టమర్లను ఆకట్టుకునే పథకాలు, బ్యాంక్​లో లభిస్తున్న సర్వీసులు–ఉపయోగాలు వంటి వాటిని క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. రూరల్​ ఏరియాల్లో వినియోగించాల్సిన మార్కెటింగ్ స్ర్టాటజీస్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. బ్యాంకింగ్​ ఇండస్ర్టీలో వస్తున్న మార్పులు, మార్కెటింగ్​ ఎన్విరాన్​మెంట్​, కన్స్యూమర్​ బిహేవియర్​, బి‌‌2బి మార్కెటింగ్​, సర్వీస్​ మార్కెటింగ్​, ఇంటర్నేషనల్​ బిజినెస్​, బ్రాండింగ్, మార్కెటింగ్​ చానల్స్​, అడ్వర్​టైజింగ్ అండ్​ పబ్లిక్​ రిలేషన్స్​, 4 పీస్ ఆఫ్ మార్కెటింగ్​, సేల్స్ ప్రమోషన్, సోషల్​ మీడియా మార్కెటింగ్, పర్సనల్​ సెల్లింగ్​ వంటి టాపిక్‌ల నుంచి ప్రొఫెషనల్​ నాలెడ్జ్​ను పరీక్షించేలా ప్రశ్నలు వస్తాయి.

లా ఆఫీసర్​
బ్యాంకింగ్ చట్టాలు, నెగోషియబుల్​ ఇన్​స్ర్టుమెంట్స్​ యాక్ట్స్​, అగ్రికల్చర్​ చట్టాలతో పాటు వినియోగదారుల చట్టాలు, ఇన్సూరెన్స్ చట్టాలు, పోరమ్స్​, కంపెనీ యాక్ట్​, బ్యాంకింగ్ అంబుడ్స్​మన్​, మనీలాండరింగ్​ యాక్ట్​, ఐటీ చట్టం 2000, ఫారెన్​ ఎక్స్​చేంజ్​ యాక్ట్, కాంట్రాక్ట్​ ఆఫ్​ గ్యారంటీ, టైప్స్​ అఫ్ కంపెనీస్​, పార్ట్‌నర్​షిప్​ యాక్ట్​ వంటి లా రిలేటెడ్​ అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.

ప్రిలిమ్స్​: ఇది కేవలం క్వాలిఫయింగ్​ పరీక్ష మాత్రమే. దీనిలో వచ్చిన మార్కులను ఫైనల్​ మెరిట్​లో కలపరు. నోటిఫికేషన్​లో పేర్కొన్న లా ఆఫీసర్, రాజ్యభాష అధికారి పోస్టులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్, బ్యాంకింగ్ రంగానికి సంబంధించి జనరల్ అవేర్‌నెస్‌ ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు-25 మార్కులకు, రీజనింగ్ 50 ప్రశ్నలు-50 మార్కులకు, జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులకు మొత్తం 125 ప్రశ్నలకు గానూ 150 మార్కులకు ఇంగ్లిష్/హిందీ మాధ్యమంలో పరీక్ష ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత ఉంటుంది. డ్యూరేషన్120 నిమిషాలు.

ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు-25 మార్కులకు, రీజనింగ్ 50 ప్రశ్నలు-50 మార్కులకు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-50 మార్కులకు మొత్తం 125 ప్రశ్నలకు గానూ150 మార్కులకు ఇంగ్లిష్/హిందీ మాధ్యమంలో పరీక్ష ఉంటుంది. డ్యురేషన్ 120 నిమిషాలు ప్రతి అంశానికి 40 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది .

మెయిన్ పరీక్ష: ప్రిలిమినరీ పరీక్షలో మినిమం కటాఫ్ మార్కులు పొందిన వారిని మెయిన్‌కు షార్ట్‌లిస్ట్ చేస్తారు. రాజ్యభాష అధికారి పోస్టుకు నిర్వహించే మెయిన్ పరీక్షలో ప్రొఫెషనల్ నాలెడ్జ్​ నుంచి ఆబ్జెక్టివ్​, డిస్క్రిప్టివ్​ తరహాలో ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్​లో 45 ప్రశ్నలు, డిస్క్రిప్టివ్​లో 2 ప్రశ్నలు వస్తాయి. రెండింటికీ కలిపి 60 మార్కులు కేటాయించారు. ఆబ్జెక్టివ్​, డిస్క్రిప్టివ్ పరీక్షలకు 30 నిమిషాల చొప్పున డ్యూరేషన్​ ఉంటుంది.

లా ఆఫీసర్, ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులకు ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంశం నుంచి 60 ప్రశ్నలు- వస్తాయి. మొత్తం 60 మార్కులు కేటాయించారు . డ్యూరేషన్ 45 నిమిషాలు. ప్రిలిమినరీ, మెయిన్ ఆబ్జెక్టివ్​పరీక్షల్లో ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత ఉంటుంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!