నిరుద్యోగులకు కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (Jobs in IB) భారీ శుభవార్త చెప్పింది. 1671 ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికారులు తాజాగా నోటిఫికేషన్ (IB Job Notification) విడుదల చేశారు. సెక్యూరిటీ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు. మొత్తం 1671 ఖాళీల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 1521 కాగా.. ఎంటీఎస్ పోస్టులు 150 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల అంటే నవంబర్ 5వ తేదీన ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల నవంబర్ 25ను ఆఖరి తేదీగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను అధికారిక వెబ్‌సైట్ mha.gov.inలో సమర్పించాల్సి ఉంటుంది. టైర్-1, టైర్-2, టైర్-3 పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు అధికారులు.
విద్యార్హత: ఈ ఉద్యోగాలకు విద్యార్హతను కేవలం టెన్త్ గా నిర్ణయించారు. టెన్త్ పాసైన వారు ఈ 1671 ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు వయోపరిమితి 27 ఏళ్లు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
దరఖాస్తు లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వేతనాలు: సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.21700 నుంచి రూ.69100 వేతనం చెల్లించనున్నారు. ఎంటీఎస్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.18 వేల నుంచి రూ.56900 వరకు వేతనం ఉంటుంది.
Job
Super Aparna City
10th pass
Mallavarapu vinodini . intermediate pass . Marks 486