HomeJOBSటెన్త్ అర్హతతో.. ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగాలు, రేపటి నుంచే అప్లికేషన్లు

టెన్త్ అర్హతతో.. ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగాలు, రేపటి నుంచే అప్లికేషన్లు

దేశ అంతర్గత భద్రతలో కీలక పాత్ర పోషించే ఇంటెలిజెన్స్ బ్యూరో (IB), మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (జనరల్ MTS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా దేశ వ్యాప్తంగా వివిధ అనుబంధ నిఘా బ్యూరో (SIB)లలో ఖాళీగా ఉన్న 362 పోస్టులను భర్తీ చేయనున్నారు. టెన్త్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. రేపటి (నవంబర్ 22) నుంచి అభ్యర్థులు డిసెంబర్ 14 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి వివరాలు:

సంస్థ పేరు-ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)

పోస్ట్ – మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (జనరల్) MTS

మొత్తం పోస్టులు-362

ఖాళీల వివరాలు:

హైదరాబాద్- 8

విజయవాడ-2

బెంగళూరు-6

చెన్నై-10

ముంబై- 22

ఢిల్లీ-108

విద్యార్హత:

అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.

వయస్సు (14-12-2025 నాటికి): అభ్యర్థుల కనీస వయస్సు 18- 25 ఏళ్ల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

జీతం: రూ. 18,000 – 56,900 వరకు జీతం చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

ఎంపిక విధానం:

ఎంపిక ప్రధానంగా రెండు విధాలుగా జరుగుతుంది.

1. టైర్-I పరీక్ష (ఆన్‌లైన్ – ఆబ్జెక్టివ్ MCQ)

ప్రశ్నలు: 100 ప్రశ్నలు (ప్రతి ప్రశ్నకు 1 మార్కు).

సబ్జెక్టులు: జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్.

నెగెటివ్ మార్కింగ్: ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల మైనస్ చేస్తారు.

2. టైర్-II పరీక్ష (డిస్క్రిప్టివ్ టెస్ట్)

సబ్జెక్ట్: ఇంగ్లీష్ లేదా స్థానిక భాషలో పేరా రైటింగ్, పదజాలం, వ్యాకరణం.

మార్కులు: 50 మార్కులు (అర్హత మార్కులు: 20).

షార్ట్‌లిస్ట్: టైర్-II కోసం ఖాళీల సంఖ్యకు 10 రెట్లు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.

పైనల్ లిస్ట్: టైర్-I పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతాయి.

ఎలా అప్లై చేయాలి ?

అభ్యర్థులు MHA వెబ్‌సైట్ (https://mha.gov.in/) ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.

రిజిస్టేషన్: MHA వెబ్‌సైట్‌లో రిక్రూట్‌మెంట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి.. వ్యక్తిగత, విద్యార్హతకు సంబంధించిన వివరాలను జాగ్రత్తగా ఎంటర్ చేయండి.

డాక్యుమెంట్ అప్‌లోడ్: తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్, ఫోటో అప్‌లోడ్ చేయండి.

ఫీజు: SBI Epay (కార్డ్/UPI/నెట్ బ్యాంకింగ్ లేదా SBI చలాన్) ద్వారా ఫీజు చెల్లించండి.తర్వాత సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here