ఇంటెలిజెన్స్ బ్యూరో.. పలు ఉద్యోగాల భర్తీకి గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలుసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 362 పోస్టులను భర్తీ చేయనున్నారు. టెన్త్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఇందుకు అర్హులు. అధికారిక వెబ్ సైట్ www.mha.gov.in ద్వారా ఈ ఉద్యోగాలకు డిసెంబర్ 14 లోపు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్య వివరాలు :
మొత్తం ఖాళీలు- 362
సంస్థ పేరు- ఇంటెలిజెన్స్ బ్యూరో
పోస్ట్ పేరు- మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (జనరల్)
అర్హతలు:
విద్యార్హత: అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ పాసై ఉండాలి.
వయస్సు:
వయస్సు (12/14/2025 నాటికి): అభ్యర్థి వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, వయో పరిమితిలో సడలింపు వర్తిస్తుంది. అంతే కాకుండా ఇతర రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది.
టైర్-I (ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్)
టైర్-II (డిస్క్రిప్టివ్)
అప్లికేషన్ :
ఆసక్తి గల అభ్యర్థులు MHA అధికారిక వెబ్‌సైట్ www.mha.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ సందర్శించవచ్చు.





