HomeJOBSడిగ్రీ,బీటెక్ అర్హతతో ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ పోస్టులు.. వెంటనే అప్లై చేయండి

డిగ్రీ,బీటెక్ అర్హతతో ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ పోస్టులు.. వెంటనే అప్లై చేయండి

భారత వైమానిక దళంలో (Indian Air Force) కెరీర్ ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ & నాన్-టెక్నికల్) విభాగాలలో ఖాళీగా ఉన్న 379 గ్రూప్ ‘A’ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి AFCAT 02/2026 అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. జులై 2027 లో ప్రారంభమయ్యే కోర్సుల కోసం పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన అర్హతలు, ముఖ్యమైన తేదీలు, ఖాళీల వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

IAF AFCAT 02/2026 రిక్రూట్‌మెంట్ పూర్తి వివరాలు:
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని వైమానిక దళంలో పర్మనెంట్ కమిషన్ (PC), షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) కింద ఈ నియామకాలు జరుగుతున్నాయి.

ఆన్‌లైన్ అప్లికేషన్ల ప్రారంభ తేదీ: మే 20 నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

చివరి తేదీ: జూన్ 19 (రాత్రి 11:30) వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ తేదీ: ఆగస్టు 4నుంచి అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచుతారు.

ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) తేదీ: ఆగస్టు 8న సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.

మొత్తం ఖాళీల వివరాలు:
మొత్తం 379 ఖాళీలను వివిధ విభాగాల వారీగా కేటాయించారు.

ఫ్లయింగ్ బ్రాంచ్ : పురుషులకు , మహిళలకు కలిపి మొత్తం 35 షార్ట్ సర్వీస్ కమిషన్ ఖాళీలు ఉన్నాయి.

గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ – Technical): ఏరోనాటికల్ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్ & మెకానికల్) విభాగంలో పర్మనెంట్ కమిషన్, షార్ట్ సర్వీస్ కమిషన్ కింద అత్యధిక ఖాళీలు ఉన్నాయి.

గ్రౌండ్ డ్యూటీ (నాన్-టెక్నికల్ – Non-Technical): వెపన్ సిస్టమ్స్ (WS), అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్, అకౌంట్స్, ఎడ్యుకేషన్, మెటియోరాలజీ విభాగాల్లో ఖాళీలు కలవు.

NCC స్పెషల్ ఎంట్రీ & GATE స్కోర్ ఎంట్రీ: వీరికి రాత పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. వీరు నేరుగా AFSB ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు.

అర్హత ప్రమాణాలు:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు భారతీయ పౌరుడై ఉండాలి. అంతే కాకుండా అవివాహితులై ఉండాలి.

వయస్సు:
ఫ్లయింగ్ బ్రాంచ్: 20 నుంచి 24 సంవత్సరాలు (అనగా 02 జూలై 2003- 01 జూలై 2007 మధ్య జన్మించి ఉండాలి). DGCA జారీ చేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్నవారికి 26 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.

గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ & నాన్-టెక్నికల్): 20 నుంచి 26 సంవత్సరాలు (అనగా 02 జూలై 2001, 01 జూలై 2007 మధ్య జన్మించి ఉండాలి).

విద్యార్హతలు:
ఫ్లయింగ్ బ్రాంచ్ & వెపన్ సిస్టమ్స్:
10+2 స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్ ఉత్తీర్ణతతో పాటు ఏదైనా విభాగంలో కనీసం 3 ఏళ్ల డిగ్రీ లేదా 4 ఏళ్ల బీఈ, బీటెక్ పూర్తి చేసి ఉండాలి.

గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్): 10+2 లో ఫిజిక్స్, మ్యాథ్స్ తో పాటు నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఇంజనీరింగ్ స్ట్రీమ్స్‌లో (ఎలక్ట్రానిక్స్/మెకానికల్/కంప్యూటర్ సైన్స్/ఐటీ మొదలైనవి) 4 ఏళ్ల డిగ్రీ కలిగి ఉండాలి.

ఇతర నాన్-టెక్నికల్ పోస్టులు: అకౌంట్స్ పోస్టులకు B.Com/BBA/BMS, ఎడ్యుకేషన్ పోస్టులకు పీజీ అర్హత ఉండాలి. ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా 30 మే 2027 నాటికి పాస్ సర్టిఫికేట్ సమర్పించగలరనే నిబంధనతో అప్లై చేసుకోవచ్చు.

అప్లై చేసుకునే విధానం:
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి.

  1. అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్ afcat.cdac.in లోకి లాగిన్ అవ్వాలి.
  2. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న “AFCAT 02/2026” లింక్‌పై క్లిక్ చేసి అవసరం అయిన వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  3. ఆ తర్వాత మీ విద్యా అర్హతలు, వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి, ఫోటో,సంతకం, తగిన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
  4. అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్ (నెట్ బ్యాంకింగ్/క్రెడిట్/డెబిట్ కార్డ్) ద్వారా చెల్లించి, అప్లికేషన్ ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి. భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్‌అవుట్ తీసుకోవడం మర్చిపోవద్దు.
RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here