HomeLATESTఎగ్జామ్​ లేకుండా ఈసీఐఎల్​లో 1,625 ఉద్యోగాలు

ఎగ్జామ్​ లేకుండా ఈసీఐఎల్​లో 1,625 ఉద్యోగాలు

హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్​) జూనియర్​ టెక్నీషియన్​ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన 1625 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల‌కు సంబంధించి దరఖాస్తులు ఆన్​లైన్​లో ఏప్రిల్​ 11 వరకు చేసుకోవచ్చు.

పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల‌కు పోస్టు బట్టి రూ.20,480 నుంచి రూ. 24,780 వ‌ర‌కు నెల‌వారీ వేత‌నం ఉంటుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఏప్రిల్‌ 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయసు 30 ఏళ్లకు మించకూడదు.

పోస్టులు:
ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 814 పోస్టులు.. జీతం: రూ. 20,480,
ఎలక్ట్రిషియన్- 184 పోస్టులు.. జీతం: రూ. 22,528,
ఫిట్టర్- 627 పోస్టులు.. జీతం రూ. 24,780
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ /ఎలక్ట్రీషియన్ /ఫిట్టర్ ట్రేడ్‌లో 2 సంవత్సరాల ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి.

సెలెక్షన్​ ప్రాసెస్​: అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ తీసుకొని, మెరిట్ ఆధారంగా 1:4 అభ్యర్థుల‌ను షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం హైదరాబాద్‌లో నిర్వహించే డాక్యుమెంట్ వెరిఫికేష‌న్ అన‌ంత‌రం పోస్టింగ్ ఇస్తారు. ఈ నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు ప్రక్రియ కోసం అధికారిక వెబ్‌సైట్ www.careers.ecil.co.in ను సంప్రదించాలి.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!