హైదరాబాద్ జిల్లాలో వైద్య రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ఆరోగ్యశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. జిల్లాలోని బస్తీ దవాఖానాలు, జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం (NTEP) కింద మొత్తం 87 ఖాళీ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలయింది. ఇందులో 24 మెడికల్ ఆఫీసర్లు, 49 స్టాఫ్ నర్సులు, అలాగే 7 ఏఎన్ఎంలు, 7 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. క్షయ నిర్మూలన పోస్టులకు ఈ నెల 18న వాక్ ఇన్ ఇంటర్వ్యూలు ఉండగా, బస్తీ దవాఖానా పోస్టులకు ఈ నెల 20 నుంచి 25 మధ్య సికింద్రాబాద్లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో అప్లికేషన్లు స్వీకరిస్తారు. రూ.500 డీడీ ఫీజుతో అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
జిల్లా వ్యాప్తంగా ఉన్న బస్తీ దవాఖానాల్లో , వివిధ ఆరోగ్య కార్యక్రమాల కింద మొత్తం 87 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ప్రధానంగా 24 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, 49 స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్నాయి. అలాగే జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం (NTEP) కింద 7 ఏఎన్ఎం (ANM) పోస్టులు, 7 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
వాక్ ఇన్ ఇంటర్వ్యూలు:
జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం కింద ఉన్న 14 పోస్టులకు సంబంధించి ఈ నెల 18న నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయి. అర్హత ఉన్న అభ్యర్థులు సరైన డాక్యుమెంట్స్ తో హాజరు కావాలి. ఇక బస్తీ దవాఖానాల్లోని 24 మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. అలాగే.. 49 స్టాఫ్ నర్స్ పోస్టులకు ఈ నెల 24, 25 తేదీల్లో అప్లికేషన్లు అందజేయవచ్చు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అప్లికేషన్లు స్వీకరించడానికి అవకాశం కల్పించారు.
అప్లికేషన్లు విధానం:
అభ్యర్థులు తమ అప్లికేషన్లు హైదరాబాద్ జిల్లా డీఎంహెచ్ఓ కార్యాలయంలో (నాలుగు అంతస్తుల భవనం, జీహెచ్ఎంసీ కాంప్లెక్స్, సికింద్రాబాద్) సమర్పించాల్సి ఉంటుంది. అప్లికేషన్లు.. పాటు అన్ని విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన ఒరిజినల్ జిరాక్స్ జతపరచాలి.
అప్లికేషన్ ఫీజు:
రూ.500గా ఫీజు నిర్ణయించారు. దీనిని హైదరాబాద్..డీడీఎస్ హెల్త్ పేరిట డిమాండ్ డ్రాఫ్ట్ (DD) రూపంలో చెల్లించాలి. అప్లికేషన్ ఫారాలను హైదరాబాద్ జిల్లా అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.





